రాధేశ్యామ్ లో 3 మిస్టేక్స్.. ఇవే సినిమాను దెబ్బతీస్తున్నాయా..?

రాధేశ్యామ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ గురించి అభిమానులు అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు అనే విషయం తెలిసిందే. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు 11వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం కాని ప్రభాస్ అభిమానులు అందరూ అనుకున్నారు. అయితే మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న మాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. అయితే ఈ సినిమాలో ఉన్న మూడు మిస్టేక్స్ ఈ సినిమాకి ఎంతో మైనస్ గా మారిపోయినట్టు అనిపిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిస్టేక్ 1: సినిమా లో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ సినిమా మొత్తం పూజా హెగ్డే ప్రభాస్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. ముఖ్యంగా భాగ్యశ్రీ పాత్ర ఎందుకు ఉందో కూడా ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఇక వీరిద్దరి మధ్య మాతృత్వ అనుబంధం సంబంధించి కొన్ని సీన్లు మాత్రం ఉంటాయి. కొన్ని క్యారెక్టర్లు మాత్రం ఈ సినిమాలో ఎందుకు ఇరికించారో కూడా అర్థం కాదు. మురళి శర్మ లాంటి నటుడికి అయితే ఒక్క మంచి డైలాగ్ కూడా లేకపోవడం గమనార్హం.

మిస్టేక్ 2 : సినిమా కథను బట్టి బడ్జెట్ వుండాలి అని అంటూ ఉంటారు. కానీ బాహుబలి సాహో ఆడాయి లాభాలు తెచ్చి పెట్టాయి కదా అని అవసరం లేకపోయినా కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టారేమో అనిపిస్తూ ఉంటుంది 1970 ల నాటి ఇటలీ సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేసుకుంటే ఖర్చు పెద్దగా అయ్యేదికాదు. ప్రేమకథ ను ఇండియా లోని మంచి అందమైన లొకేషన్లలో చూపించకుండా ప్రత్యేకమైన సెట్టింగులు వేసి చూపించారు. దీంతో ఇక ప్రేమకథలో ఉండాల్సిన ఫీల్ కాస్త మిస్సయింది అని ప్రేక్షకులకు అనిపిస్తుంది.

మిస్టేక్ 3 : ఫీల్ గుడ్ న్యూలవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు సినిమాలో కూడా సంగీతం కూడా ఎంతో ముఖ్యం. ఇక ప్రతీ పాట ప్రేక్షకుల మదిని హత్తుకునేలా ఉండాలి. అయితే రాధేశ్యామ్ సినిమాలో తమన్ అందించిన నేపధ్య సంగీతం ఎంతో బాగుంది. కానీ సినిమాలోని పాటలు మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. స్క్రిప్టులో ఉన్న లోపాలకి తోడు ఇవన్నీ రాధేశ్యామ్ సినిమాను అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వకుండా చేస్తున్నాయి అని చెప్పాలి. సినిమా ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం ఎంతో ఇంపార్టెంట్. దీంతో ఈ సినిమా ఎలా కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఒక వారం తర్వాత తెలియనుంది..