స‌జ్జ‌ల‌, సాయిరెడ్డిల‌కు మంత్రి ప‌ద‌వులు..!

త్వ‌ర‌లోనే ఏపీ మంత్రి వ‌ర్గంలో కీల‌క మార్పులు ఉంటాయని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. దీనికి సంబంధించి.. సీఎం జ‌గ‌న్ కూర్పు, చేర్పులు కూడా ఖ‌రారు చేశార‌ని.. పెద్ద ఎత్తున తాడేప‌ల్లి వ‌ర్గాల్లో ప్ర‌చా రం జ‌రుగుతోంది. ఇక‌, ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో గుమ్మ‌నూరు జ‌య‌రాం స‌హ‌.. నారాయ‌ణ స్వామి, శంకర నారాయ‌ణ‌, ఆళ్ల నాని, పినిపే విశ్వ‌రూప్‌, రంగ‌నాథ‌రాజు స‌హ‌.. వ‌నిత వంటివారిని ప‌క్క‌న పెట్టేస్తు న్నార‌ని.. తెలుస్తోంది. అయితే.. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డిని మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటార‌నే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక‌, అదేవిధంగా ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న(జూన్‌తో ప‌ద‌వీకాలం పూర్త‌వుతుంది) విజ‌య‌సాయిరె డ్డిని కూడా ప్ర‌భుత్వంలోకి తీసుకుంటార‌ని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంత‌? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం స‌జ్జ‌ల .. సీఎం జ‌గ‌న్‌కు అన్నీతానై వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌తి విష‌యంలోనూ.. ప్ర‌భుత్వానికి ఆయ‌న చేదోడుగా ఉంటున్నారు. స‌మ‌స్య ఏదైనా.. త‌క్ష‌ణ‌మే స్పందిస్తున్నా రు. దానిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో విప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌కు ఏ అధికారం ఉంద‌ని.. మాట్లాడుతున్నారు? అంటూ.. కేసులు కూడా న‌మోదు అవుతున్నాయి.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల కార‌ణంగా.. స‌జ్జ‌ల‌ను వ‌దులుకునేందుకు సీఎం జ‌గ‌న్ సిద్దంగా లేరు. ఎందుకంటే.. మున్ముందు వ‌చ్చేది ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం. సో.. ఆయ‌న అవ‌స‌రం ఎంతో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను కేబినెట్‌లోకి తీసుకున్నా.. తీసుకునే అవ‌కాశం ఉంది. ముందు ఆయ‌న‌ను మంత్రిని చేసి.. ఆరు మాసాల గ‌డువులోగా.. ఆయ‌న‌ను ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవ‌కాశం కూడా ఉంది. సో.. దీనికి ఛాన్స్ క‌నిపిస్తోంది. అయితే.. సాయిరెడ్డి విష‌యంలో జ‌రుగుతున్న ప్రచారంలో వాస్త‌వం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే..ఆయ‌న‌కు ఢిల్లీలో రాజ‌కీయాల‌పైనే ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంది. పార్టీకి, ఏపీ ప్ర‌భుత్వానికి కూడా ఇదే కావాలి. సో.. ఆయ‌న ఢిల్లీ వ‌దిలి వ‌చ్చే అవ‌కాశం లేదు. అయితే.. ఈ ద‌ఫాఆయ‌న రాజ్య‌స‌భ‌కు కాకుం డా.. విశాఖ పార్ల‌మెంటు స్థానం నుంచి ప్ర‌జాక్షేత్రంలో గెలిచి లోక్‌స‌భ‌లో అడుగు పెట్టాల‌ని అనుకుంటు న్నారు. దీంతో.. రాజ్య‌స‌భ‌కు స‌మ‌యం అయిపోయినా.. ఆయ‌న అలాగే ఉండి.. వ‌చ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి.. లోక్‌స‌భ‌లో అడుగు పెట్ట‌డం ద్వారా.. పార్టీకిప్ర‌బుత్వానికి మ‌రింత మేలు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సో.. మొత్తానికి ఈ ప్రచారంలో కొంత నిజం ఉంటే. మ‌రికొంత ప్ర‌చార‌మే ఉండ‌డం గ‌మ‌నార్హం.