జక్కన్న ప్లాన్ బెడిసి కొడుతుందా.. త్రిబుల్ ఆర్ విడుదలకు రెండు సమస్యలు?

త్రిబుల్ ఆర్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ సినిమాను మొదలు పెట్టాడు.. కానీ సినిమాకి ముహూర్తం మాత్రం కలిసి రాలేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఏ రేంజ్ లో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయో .. అదే రేంజ్ లో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షూటింగ్ దగ్గర నుంచి విడుదల వరకు అన్ని అడ్డంకులే. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది అటు ప్రేక్షకులకు మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. చిత్ర బృందం విడుదల తేదీలు ప్రకటించిన అటు అభిమానులు మాత్రం సరిగ్గా అదే రోజు విడుదల అవుతుందా అన్న విషయాన్ని మాత్రం నమ్మలేకపోతున్నారూ.

సాధారణంగా రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అని అందరికీ తెలుసు. కానీ త్రిబుల్ ఆర్ సినిమా మాత్రం ఆలస్యం అయింది. ఇక ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇక ఇప్పుడు మార్చి 25 వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నాం అని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈసారి విడుదలకు కూడా త్రిబుల్ ఆర్ సినిమా కు రెండు సమస్యలు ఇబ్బందులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. మార్చి నెలలో రిలీజ్ అంటే ఆ సమయంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రేక్షకులకు పరీక్షలను వదిలేసి సినిమాకు వెళ్లే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది.

అందుకే ఇలాంటి సమయంలో అటు దర్శకనిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయాలని అస్సలు అనుకోరు. కానీ జక్కన్న మాత్రం మార్చి 25వ తేదీన సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక అటు వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈసారి ఐపీఎల్ లో 10 జట్లు పాల్గొంటూ ఉండటం మెగా వేలం కారణంగా ఎంతో మంది ఆటగాళ్లు జట్లు మారడం జరిగింది. దీంతో ఐపీఎల్ గురించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఐపీఎల్ మ్యాచ్ ల కారణంగా అటు ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద కొంత మంది ప్రేక్షకులు ఆసక్తి చూపకపోయే అవకాశం కూడా లేకపోలేదు ఇక ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత ఓ వైపు పరీక్షలు మరోవైపు ఐపీఎల్ ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. మరి జక్కన్న ఎలాంటి ప్లాన్ వేసుకుని రిలీజ్కు సిద్ధం అయ్యాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..

Share post:

Popular