స‌మంత – చైతు బాట‌లో మ‌రో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో.. త్వ‌ర‌లో విడాకులు..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు విడాకుల ప‌ర్వాలు ఎక్కువుగా న‌డుస్తున్నాయి. గ‌తేడాది అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత విడాకులే అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ విడాకుల నుంచి అంద‌రూ తేరుకున్నారు అనుకుంటోన్న టైంలో కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య – హీరో ధ‌నుష్ కూడా విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి మ‌రో షాక్ ఇచ్చారు. అంత‌కుముందే బాలీవుడ్ క్రేజీ హీరో అమీర్‌ఖాన్ , త‌న రెండో భార్య కిర‌ణ్‌రావుకు విడాకులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ మ‌ధ్య‌లోనే మ‌రికొంద‌రు సినిమా వాళ్లు, బుల్లితెర న‌టీన‌టులు కూడా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోనే మ‌రో సీనియ‌ర్ హీరో చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ టాలీవుడ్ సీనియ‌ర్ హీరో ఎవ‌రో కాదు గెడ్డం చ‌క్ర‌వ‌ర్తి అలియాస్ జేడీ చ‌క్ర‌వ‌ర్తి. అప్పుడెప్పుడో పాత జ‌మానాలో వ‌చ్చిన రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమాల‌తో పాపుల‌ర్ అయిన జేడీ హీరోగా కొన్ని సినిమాలు చేసి మెప్పించాడు. నాగ‌చైత‌న్య జోష్ సినిమాలో విల‌న్‌గా కూడా చేశాడు.

అయినా మ‌నోడికి మంచి బ్రేక్ రాలేదు. చాలా లేట్ మ్యారేజ్ చేసుకున్నాడు. త‌న‌తో క‌లిసి ఓ సినిమాలో న‌టించిన అనుకృతి గోవింద్ శ‌ర్మ‌ను జేడీ పెళ్లి చేసుకున్నాడు. మ‌రి వీరి మ‌ధ్య ఎక్క‌డ పొరాపొచ్చ‌లు వ‌చ్చాయో గాని.. త్వరలోనే జేడీ చక్రవర్తి-అనుకృతి గోవింద శర్మ విడాకులు తీసుకోబోతున్నార‌న్న వార్త అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక అనుకృతి ఎవ‌రో కాదు వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ్రీదేవి సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.

ఆ సినిమా షూటింగ్ టైంలోనే వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. అనుకృతి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అమ్మాయి. ఆమె తండ్రి టాప్ బిజినెస్‌మేన్‌. త‌ల్లి యూపీ సీఎం ద‌గ్గ‌ర టాప్ ర్యాంకు అధికారిణిగా ప‌ని చేస్తోంది. మోడ‌లింగ్ అంటే ఇష్టంతో చిన్న వ‌య‌స్సులోనే మోడ‌లింగ్‌లోకి వ‌చ్చిన ఆమె ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చింది.