టాప్ హీరోలు అయితేనేం.. ఇప్పటికీ తెలుగు సరిగా మాట్లాడ్డం రాదు..

సినిమా పరిశ్రమలో వారసత్వం కామన్. టాలీవుడ్ లో ఇప్పటికి మూడు తరాల నుంచి నటీనటులు వస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఈ వారసత్వం కొనసాగుతూనే ఉంది. చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టి.. మెగాస్టార్ గా ఎదిగాడు. ఆయన ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఎంతో మంది హీరోలు వచ్చారు. చిరంజీవి తనయుడు రాంచరణ్ ఇప్పుడు టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. అటు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు కూడా ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం అద్భుత హీరోగా ముందుకుసాగుతున్నాడు. అటు కృష్ణం రాజు వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పాన్ ఇండియన్ హీరోగా ఎదిగాడు.

ప్రస్తుతం ఈ హీరోలంతా స్టార్ హీరోలుగా మారారు. ప్రస్తుతం పేజీలకు పేజీల డైలాగులు చెప్తున్నారు. కానీ ఒకప్పుడు వీరికి అసులు తెలుగు సరిగా మాట్లాడ్డం వచ్చేది కాదు. మహేష్ బాబు పుట్టి పెరిగింది, చదివింది కూడా అక్కడే కావడంతో ఆయనకు తెలుగు వచ్చేది కాదు. ఆయన తెలుగు నేర్చుకుని మరీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అటు రాంచరణ్, నాని, అల్లు అర్జున్ సైతం ఇప్పటికీ కొన్ని పదాలను సరిగ్గా పలకలేరు. వారికి ‘ల’ కి ‘ళ’ కి ఇప్పటికీ తేడా తెలియదు. పెళ్లి అని పలికేటప్పుడు పెల్లి అని ఇప్పటీకీ అంటుంటారు. టాప్ హీరోలు అయినా తెలుగు పలకడం విషయంలో మాత్రం పూర్ అని చెప్పుకోవచ్చు.

ఇక మోహన్ బాబు కుటుంబ సభ్యులు మాట్లాడే మాటలు ఏ రేంజిలో ట్రోల్ అవుతున్నాయో సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. మంచు లక్ష్మి మాట్లాడే తెలుగు వింటే చెవుల్లోనుంచి రక్తం కారడం ఖాయం. అటు మంచు విష్ణు సైతం తెలుగు మాట్లాడేందుకు నానా ఇబ్బందులు పడుతాడు. అటు నితిన్ సైతం సరిగా తెలుగు మాట్లాడలేడు. నత్తి నత్తిగా మాట్లాడుతుంటాడు. మొత్తంగా తెలుగు సినిమా పరిశ్రమలోని చాలా మంది హీరోలు తెలుగును సరిగా పలకలేరు. పలికే ప్రయత్నం కూడా చేయకపోవడం విశేషం.

Share post:

Popular