అన్న కోసం ఎన్టీఆర్ త్యాగం …మాములుగా లేదుగా ?

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో రెండో సినిమా చేస్తున్నాడని మన అందరికి తెలిసిందే . అయితే ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేయాల్సివుండగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమాలో లాక్ అయిపోవడం ,అలాగే కొరటాల శివ మెగా స్టార్ తో ఆచార్య సినిమా చేస్తుండటం తెలిసిందే .ఎట్టకేలకు ఆ రెండు సినిమాలు పూర్తి అవడంతో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పట్టాలపైకి వచ్చింది .ఈ నెల 7 వ తేదీన ఈ సినిమా ప్రారంభం అవుతుంది .ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లూక్లో కొరటాల చూపించబోతున్నారట .ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ని కొంత బరువు తగ్గాలని చూసించాడట డైరెక్టర్ కొరటాల శివ .దానితో ఎన్టీఆర్ బరువు తగ్గటానికి వర్క్ అవుట్ స్టార్ చేస్తునట్టు తెలుస్తుంది .

ఇది ఇలా ఉంటె ఎన్టీఆర్ 30 సినిమా కావడం , ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ,యువ సుధా ఆర్ట్స్ ల బ్యానర్లపై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా వస్తుంది. ఎన్టీఆర్ ఇంతక ముందు తన అన్న కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా ‘ జై లవకుశ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే ,అయితే ఆ సినిమా హిట్ అయిన ఆశించినత పెద్దగా లాభాలు రాలేదట .అందుకే ఎన్టీఆర్ తన అన్నకోసం మరొక సినిమా చేయాలనీ అనుకున్నాడట .ఎన్టీఆర్ , కొరటాలతో చేసే సినిమాకి కళ్యాణ్ రామ్ దగ్గర రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదట . సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చిన లాభాలో షేర్ తీసుకుంటాడని టాక్ . ఈలెక్కన ఎన్టీఆర్ దాదాపు 50 కోట్ల రెమ్యూనరేషన్ తన అన్న కోసం వదులుకున్నట్టే .ఎందుకంటే అన్న కోసం పారితోషకం ,కొరటాల కోసం బరువు తగ్గుతున్నాడట ఎన్టీఆర్