బాప్‌రే.. ఆ సినిమా కోసం తమన్నా అన్ని కోట్లు ఛార్జ్ చేసిందా..కెరీర్ లోనే హైయెస్ట్ ఇదే..?

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే.. హీరో హీరోయిన్లు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలు అయితే ఆ పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అంటూ 60-70 కోట్లు వరకు పుచ్చుకుంటున్నారు. ఇక ప్రభాస్ అయితే ఒక్కో సినిమాకి ఏకంగా 150 కోట్లు ఛార్జ్ చేస్తూ ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక హీరోలకు మేము ఏ మాత్రం తీసిపోమూ అంటూ..వాళ్లతో పోటీ పడీ మరీ.. హీరోయిన్లు కూడా పారితోషకాని భారీ రేంజ్ లో పుచ్చుకుంటున్నారు. నయన్ తార, రష్మిక,సమంత,కీర్తి సురేష్..ఇలా ఆందరు అందాల ముద్దుగుమ్మలు నిర్మాతలను డిమాండ్ చేసి మరీ కావాల్సినంత రెమ్యూనరేషని తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి చేరింది..మిల్కీ బ్యూటీ తమన్నా.

తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడెప్పుడో డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈ అమ్మడు..ఆ సినిమా అందించిన విజయం తో..కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. దీంతో ఇండస్ట్రీలో ఇంకా హీరోయిన్ గా కొనసాగుతుంది . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే చిరంజీవి,నాగార్జున,నాగచైతన్య,రామ్ చరణ్,పవన్ కళ్యాణ్,తారక్,వెంకటేష్,రామ్,ప్రభాస్.. లాంటి బడా బడా హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసింది. కానీ అప్పుడు కూడా అమ్మడు రెమ్యూనరేషన్ నాకు ఇంతే కావాలి అని డిమాండ్ చేయలేదట. కానీ..ఇప్పుడు ఓ సినిమా విషయంలో మాత్రం తన కెరీర్ లో ఎప్పుడు తీసుకోనంత పారితోషకాని డిమాండ్ చేస్తుందట తమన్నా.

ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలకు పరిమితమైన తమన్నా కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ బౌన్సర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇండియాలో తొలి మహిళా బౌన్సర్ కథతో వస్తున్న “బబ్లీ బౌన్సర్” అనే సినిమాలో తమన్నా నటిస్తుంది. ఈ విషయాని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో తమన్నా డీ గ్లామరస్ లుక్ లో కనిపించనుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్డూడియో నిర్మిస్తుండటం మరో విశేషం. అయితే ఈ సినిమా కోసం తమన్నా..కెరీర్ లోనే ఎప్పుడు తీసుకోనంత రెమ్యూనరేషన్ అందుకుంటుందట. లీక్ అవుతున్న సమాచారం బట్టి తమన్నా ఈ సినిమా కోసం 5 కోట్లు ఛార్జ్ చేసిందట. తమన్నా ఇది వరకు సినిమాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుండడంతో పాటు,,తమన్నాకు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉండడతో మేకర్స్ నిర్మాతలు అమ్మడు అడిగినంత పారితోషకానీ ఇచ్చేందుకు సిద్ధపడ్డారట. మరి చూడాలి ఈ సినిమా అమ్మడుకి ఎలాంటి గుర్తింపు తెస్తుందో..?