సినిమా హిట్ కోసం ఆ స్టార్ హీరో న‌ర‌బ‌లి ఇచ్చాడా..?

మ‌న భార‌త‌దేశంలో ఏ రంగంలో ఉన్న స్టార్లు అయినా సెంటిమెంట్ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. మ‌న వాళ్ల‌కు సెంటిమెంట్లు ఎక్కువ‌. సినిమా రంగంలో ఉన్న హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కూడా ఈ సెంటిమెంట్లు ఎక్కువే ఉంటాయి. కొంద‌రు త‌మ‌కు క‌లిసి వ‌చ్చిన న‌క్ష‌త్రం, తేదీల్లోనే సినిమాలు మొద‌లు పెడుతూ ఉంటారు.. మ‌రి కొంద‌రు మంచి డేట్ చూసుకునే త‌మ సినిమాను రిలీజ్ చేస్తూ ఉంటారు. కొంద‌రు ద‌ర్శ‌కులు త‌మ సినిమాల్లో ఆ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు ఉంటేనే సినిమా హిట్ అవుతుంద‌ని.. ఆ హీరోయిన్ ఉంటే క‌లిసొస్తుంద‌ని లెక్క‌లు వేసుకుంటూ ఉంటారు.

ఇక అటు హీరోల అభిమానుల‌కు కూడా ఈ సెంటిమెంట్ ఉంటుంది. త‌మ అభిమాన హీరోల సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వాల‌ని ర‌క‌ర‌కాల పూజ‌లు చేస్తుంటారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్న ఓ స్టార్ హీరో త‌న సినిమా హిట్ అయ్యేందుకు ఏకంగా న‌ర‌బ‌లి ఇచ్చాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఆ హీరో సినిమా విష‌యంలో ఏదో వివాదం జ‌రిగింది. ఆ టైంలో ఆ హీరో స‌ద‌రు వ్య‌క్తిపై దాడి చేయ‌డంతో సినిమా ఇండ‌స్ట్రీకే చెందిన వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి.

ఆ వ్య‌క్తి చ‌నిపోవ‌డంతో అప్పుడు దీనిపై పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. ఆ హీరో న‌టించిన ఆ సినిమా విష‌యంలోనే ఆ వ్య‌క్తి చ‌నిపోవడంతో ఇది న‌ర‌బ‌లి అంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ మ‌నిషి మ‌ర‌ణాంత‌రం ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. స్టార్ హీరో సినిమాకు న‌ర‌బ‌లి అంటూ ఈ సినిమాపై విమ‌ర్శ‌లు చాలానే వ‌చ్చాయి.