ఖిలాడి 6 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ర‌వితేజ‌కు దెబ్బ‌డిపోయిందిగా…!

మాస్ మ‌హ‌రాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి మూవీ బాక్సాఫీస్ వద్ద వారం రోజులు తిర‌క్కుండానే చేతులు ఎత్తేసింది. ఈ నెల 11న రిలీజ్ అయిన ఈ సినిమా ఆరు రోజుల‌కే ప్లాప్ దిశ‌గా వెళుతోంది. మ‌రోవైపు ఈ సినిమాకు పోటీగా వ‌చ్చిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ డీజే టిల్లు భారీ లాభాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ దిశ‌గా వెళుతోంది. 6 రోజుల‌కు ఖిలాడీ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

- Advertisement -

డే 1: 4.30 కోట్లు
డే 2: 1.95 కోట్లు
డే 3: 1.51 కోట్లు
డే 4: 87 లక్షలు
డే 5: 72 లక్షలు
డే 6: 56 లక్షలు

ఓవ‌రాల్‌గా చూస్తే తొలి రోజు మాత్ర‌మే ఖిలాడీకి భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. అప్ప్టి నుంచి ప్ర‌తి రోజు ఈ సినిమా వ‌సూళ్లు డల్ అయిపోయాయి. ఆరో రోజు కేవ‌లం 56 ల‌క్ష‌ల వ‌సూళ్లు అంటే పెద్ద దెబ్బే అనుకోవాలి. ఓవ‌రాల్‌గా 6 రోజుల‌కు చూస్తే ఏపీ + తెలంగాణ‌లో 9.91 కోట్ల నెట్, 16.80 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 11.76 కోట్ల నెట్, 21 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి.

ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రు. 23 కోట్లు.. రు. 24 కోట్లు వ‌స్తేనే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ వ‌స్తుంది. అంటే మ‌రో రు.12 కోట్ల నెట్ వ‌సూళ్లు రాబ‌ట్టాలి. ఈ మిక్స్ డ్ టాక్‌తో ఈ సినిమా ఆ వ‌సూళ్లు సాధించ‌డం డౌటే ? ఓవ‌రాల్‌గా ర‌వితేజ కెరీర్‌లో ఖిలాడి పెద్ద ప్లాప్ గా మిగిలిపోనుంది.

Share post:

Popular