టీడీపీలో కొత్త ఫైటింగ్ మొద‌లైందిగా..!

తెలుగుదేశం పార్టీలో అప్పుడే సీట్ల పంచాయితీ నడుస్తోంది…ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు పైనే సమయం ఉండగానే చంద్రబాబు..సీట్లని ఫిక్స్ చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే..వరుసపెట్టి అసెంబ్లీ స్థానాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న బాబు…ఎక్కడకక్కడే అభ్యర్ధులని పెట్టుకుని వచ్చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు…అలాగే సరిగ్గా పనిచేయని నాయకులు ఉంటే వారిని పక్కన పెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నారు. లేదంటే నేతలకు సరిగ్గా పనిచేయాలని వార్నింగ్ ఇచ్చి…మరో అవకాశం ఇస్తున్నారు.

ఇదే క్రమంలో ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి సైతం బాబు వార్నింగ్ ఇచ్చేశారు. గత ఎన్నికలయ్యాక ప్రొద్దుటూరు ఇంచార్జ్‌గా ప్రవీణ్ కుమార్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే..ఇంచార్జ్ పదవి వచ్చాక ప్రవీణ్ పర్వాలేదనిపించేలా పనిచేసుకుంటూ వస్తున్నారు..అయితే వైసీపీ కంచుకోటగా ఉన్న ప్రొద్దుటూరులో ప్రవీణ్ ఇంకా దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉంది..అప్పుడే అక్కడ వైసీపీకి చెక్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది.

అందుకే చంద్రబాబు..తాజాగా ప్రొద్దుటూరుకు సంబంధించి నేతలతో సమావేశం పెట్టారు..ఈ సమావేశంలో ఇంచార్జ్‌గా మార్పు గురించి చర్చ జరగగా, ఎక్కువ మంది మళ్ళీ ప్రవీణ్‌కే పదవి ఇవ్వాలని కోరారు. దీంతో బాబు మళ్ళీ ప్రవీణ్‌కే ప్రొద్దుటూరు పగ్గాలు అప్పగించారు. ఇదే సమయంలో ఇక ప్రొద్దుటూరు అభ్యర్ధి తానే ప్రవీణ్ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత, కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి సైతం..ప్రొద్దుటూరు తనకే దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కేవలం ప్రవీణ్‌ని ఇంచార్జ్‌గానే పెట్టారని, ఇంకా అభ్యర్ధిని ఖరారు చేయలేదని చెప్పారు. చంద్రబాబు…తనకే ప్రొద్దుటూరు సీటు ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో లింగారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలిచారు..2014లో ఈయనకు సీటు దక్కలేదు..2019 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక నెక్స్ట్ కూడా ప్రొద్దుటూరు సీటు తనదే అంటున్నా చంద్ర‌బాబు ఆయ‌న్ను మ‌ళ్లీ భ‌రించేందుకు సిద్ధంగా లేరు.