నా భర్త అడగలేదు..నాకూ చేయాలనిపించలేదు..భార్య భర్తల సీక్రేట్స్ రివీల్ చేసిన ప్రియమణి..!!

టాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు..పోతుంటారు. కానీ వాళ్లల్లో కొందరినినే ప్రేక్షకులు అభిమానిస్తారు. సినిమా హిట్టా ఫట్టా అని ఆలోచించకుండా హీరోయిన్ బాగా నటిస్తే ఆమెను బాగా మెచ్చుకుంటారు మన జనాలు. పెళ్ళై పిల్లలు ఉన్న హీరోయిన్స్ ని కూడా ఇంకా అభిమానిస్తున్నారంటే వాళ్ళు చేసిన మూవీలు ..ఆ సినిమాలో వాళ్ళ నటన ప్రేక్షకులకి ఎంత నచ్చితే..అలా అభిమానిస్తుంటారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక అలాంటి వారిలో ప్రియమణీ..కూడా ఒకరు.

వయసు పెరిగిపోతున్న కొద్ది అందాని కూడా పెంచుకుంటూ..తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ భామ. అప్పుడెప్పుడో ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు.. అప్పుడు ఎంత అందంగా ఉందో..మొన్న రిలీజ్ అయిన భామాకలాపం సినిమాలో కూడా అలాగే పర్ ఫేక్ట్ ఫిజిక్ ను మెయిన్ టైన్ చేస్తూ.. కనిపిస్తుంది. ఇక రీసెంట్ గానే అల్లు అర్జున్ కూడా ఓ షో పాల్గోన్నప్పుడు టూ హాట్ అంటూ ప్రియమణి పై కమెంట్ చేసాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా అలాంటి కామెంట్ నే చేస్తూ…వార్తల్లో నిలిచారు.

కాగా, ప్రియమణి రీసెంట్ గా నటించిన భామా కాలపం సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ సంధర్భంగా అమ్మడు ఓ ప్రముఖ పత్రికా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ ..తన వైవాహిక జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. భామా కలాపం’లో అనుపమ వంట బాగా చేస్తుంది కదా…మరి మీరు నిజంగానే బాగ వంట చేస్తారా..అని రిపోర్టర్ అడిగినప్పుడు..” నిజం చెప్పాలంటే నాకు వంట రాదు. కానీ బాగా తింటాను. నా భర్త నాకోసం వంట చేస్తాడు. ఆయన నన్ను ఎప్పుడు నువ్వు వంట చెయ్యి..నాకు ఇది చేసిపెట్టు అని ఇప్పటి వరకు అడగలేదు. నాకు కూడా వంట చేయాలి అని ఎప్పుడు అనిపించలేదు. సో.. ముస్తఫా లాంటి భర్త దొరకడం వెరీ వెరీ లక్కీగా భావిస్తున్నా. నాకు ఆయన చేసే ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం.. ప్రేమతో ఆయన చేసిన హోమ్‌ ఫుడ్‌ నే నేను షూటింగ్ టైంలో కూడా తీసుకుంటాను ” అంటూ భర్తను ఓ రేంజ్ లో పొగిడేసింది ప్రియమణి.