ఒక్క సంతకం ఈ హీరో జీవితాని నాశనం చేసేసింది.. అబ్బాస్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే..?

“ప్రేమదేశం” సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో రికార్డ్లను తిరగ రాసి ఎన్నో సంచలన రికార్డ్ లను సృష్టించింది. 1996వ సంవత్సరంలో ఆగస్టు నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అంతేనా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ పెట్టిన దానికి ట్రిపుల్ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికి ఈ సినిమాను టీవీలో వస్తే అత్తుకుపోయి మరి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతలా నచ్చేసింది ఈ సినిమా జనాలకు.

మొదట తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఆ తరువత అనేక భాషల్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన అన్ని బాషల్లో కూడా అదే స్థాయిలో విజయం సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది ఈ సినిమా. అబ్బాస్, వినీత్ కలిసి నటించిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో టబు నటించి అదరగొట్టేసింది. ఇక ఈ సినిమాతో అబ్బాస్ కి వినీత్ కి మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. మొదటి సినిమాతోనే యూత్‏లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు అబ్బాస్. అబ్బో అప్పట్లో అబ్బాస్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదులేండి. ఎక్కడ చూసిన ఆయన హెయిర్ స్టైల్ తెగ ఫాలో అయ్యేవారు.. ఇప్పటికీ కూడా అబ్బాస్ హెయిర్ స్టైల్ ని ఫాలో అవుతున్నవారు ఉన్నారు. ప్రేమదేశం సినిమా తరువాత అబ్బాస్ కి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఆయనకు ఎలాంటి సినిమాలు చూస్ చేసుకోవాలో తెలియక వచ్చిన సినిమాలలో గజిబిజీ క్యారెక్టర్లు ఉన్న పాత్రలు సెలక్ట్ చేసుకుని సంతకాలు పెట్టుకుంటూ పోయాడు ..ఫలితంగా తన ఖాతాలో ఫ్లాప్ సినిమాలు వేసుకున్నాడు.

ఇక ఆ తరువాత సీన్ కట్ చేస్తే సినిమా అవకాశాలు తగ్గాయి. డైరెక్టర్లు అబ్బాస్ ని పట్టించుకోవడమే మానేశారు. ఏదో అబ్బాస్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు అడపదడప సినిమాల్లో అవకాశాలు ఇచ్చిన..అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఆయన నటించిన రాజహంస, శ్వేతనాగు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ సంపాదించుకోలేకపోయాయి. దీంతో అబ్బాస్ పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు. ఇక అబ్బాస్ కెరీర్ ఎలా డౌన్ ఫాల్ అయ్యిందంటే చివరకు ‘హార్పిక్’ యాడ్ లో కనిపించేంతలా డౌన్ అయ్యడు.

కొన్ని రోజులకు అబ్బాస్ కు ఆ అవకాశాలు కూడా రాలేదు. దీంతో ఇక బతకడం కష్టంగా అనిపించి బతుకుదెరువు కోసం న్యూజ్ లాండ్ వెళ్ళాడు. ఎన్నో జాబ్ లకి ట్రై చేశాడట. కానీ దొరకలేదు. దీంతో అక్కడకు వెళ్లిన కొత్తల్లో పెట్రోల్ బంక్ లో పని చేసి డబ్బులు సంపాదించుకున్నడట. ఆ తర్వాత కూలీ పనులు కూడా చేసాడట. ఇక అలా అదే ఫీల్డ్ లో అనుభవం సంపాదించి.. ఇప్పుడు అబ్బాస్ అక్కడే స్థిరపడిపోయాడట. స్టార్ హీరో లా బ్రతకాల్సిన ఆయన ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాడు అంటే కారణం ఆయన లైఫ్ లో తీసుకున్న తప్పుడు డెసీషన్స్ వళ్ళనే అంటున్నారు నెటిజన్స్.


Leave a Reply

*