మెగా ఫ్యాన్ కి బ్యాడ్ న్యూస్ …భీమ్లా నాయక్ లో హిట్ సాంగ్ తీసేస్తున్నారు !

టాలీవుడ్ లో ,తెలుగు అభిమానుల్లో భీమ్లా నాయక్ మానియా నడుస్తుంది .సినిమా ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ .ఎట్టకేలకు ఫిబ్రవరి 21 న ట్రైలర్ రిలీజ్ చేసారు.ట్రైలర్ తో మంచి ఊపుతో ఉన్న అభిమానులకు నిరాశపరిచే వార్త ఒకటి ఇండస్ట్రీ లో వినబడుతుంది.అదేమిటంటే భీమ్లా నాయ‌క్ కి ఊపు తెచ్చిన పాట‌.. టైటిల్ సాంగే. త‌మ‌న్ ఈ పాట‌ని ఇర‌గ్గొట్టాడు. ఆ పాట‌.. భ‌లే పాపుల‌ర్ అయ్యింది. ఈ పాట‌ని తెర‌పై ఎప్పుడు చూద్దామా? అని ఫ్యాన్స్ వెయిటింగ్. అయితే.. ఈ పాట సినిమాలో క‌నిపించ‌డం లేదు. ఈ సినిమా ఎండ్ కార్డ్స్ లో ఈ పాట‌ని వాడుతున్నార‌ని స‌మాచారం.

గతంలో పవన్ కళ్యాణ్ డిజాస్టర్ మూవీ బంగారం సినిమా గుర్తుందా? బంగారం సినిమాలో టైటిల్ పాట నిజానికి హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట అది. తీసుకెళ్లి క్లైమాక్స్ ముందు పెట్టారు. అప్ప‌టికే సినిమాపై ప్రేక్షకులుఓ అభిప్రాయానికి వచ్చి తల బాదుకుంటున్నారు .దాంతో పాటలో ప‌వ‌న్ ఎంత దుమ్ము రేపినా, ఆ పాట హిట్ అయినా అంతగా పట్టించుకోలేదు .మరలా అదే తప్పును భీమ్లా నాయక్ సినిమా విషయంలో చేస్తున్నారు .లాలా.. భీమ్లా పాట విష‌యంలో కూడా అదే చేస్తోంది టీమ్. నిజానికి ఈ పాట‌ని సినిమాలో కేవ‌లం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా వాడ‌దాం అనుకున్నారంట కానీ మళ్ళీ ఆ పాటని పిక్చ‌రైజ్ చేశారు. అయితే దాన్ని ఇప్పుడు ఎండ్ టైటిల్స్ లోకి తీసుకొచ్చారట. సీనియర్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ పర్యవేక్షణలో ఎందుకిలా చేస్తున్నారో వేచి చూడాలి .సినిమా హిట్ అయితే ఆ బాడ్ సెంటిమెంట్ పోతుంది ..లేకపోతే మళ్ళీ విమర్శలు ఎదురుకోవాల్సివస్తుంది .

Share post:

Latest