భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్ విశ్వరూపం.. అభిమానుల ఆకలి తీరినట్లే?

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన ఎందుకో అభిమానుల ఆకలి మాత్రం తీరలేదు. పవన్ ఇలా కాదు ఒకసారి తెరమీద కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వాలి. అలాంటి సినిమా కావాలి అని అభిమానులు కోరుకున్నారు. ఇక అచ్చంగా అభిమానులు ఆకలి తీర్చేందుకు భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు పవన్. ఈ సినిమా విడుదలకు ముందు ఎంత బజ్ క్రియేట్ చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీతారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో హాలీవుడ్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కింది భీమ్లా నాయక్. నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది.

కథ ఏంటంటే : అన్యాయం ఎక్కడ జరిగినా చూస్తూ అస్సలు సహించలేని అగ్రసేన్ పోలీస్ ఆఫీసర్ నాయక్ అదేనండి మన పవన్ కళ్యాణ్.. ఇక మాజీ ఆర్మీ ఆఫీసర్ గా ఉన్న డానియల్ శేఖర్ ( రానా ) ను అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న కేసులు అరెస్టు చేస్తాడు భీమ్లా నాయక్. పోలీస్ గురించి డానియల్ శేఖర్ తప్పుగా మాట్లాడడంతో అతడిని చితక్కొట్టి మరి పోలీస్ స్టేషన్కు తరలిస్తాడు. అతను మాజీ ఆర్మీ ఆఫీసర్ అన్న విషయం మాత్రం భీమ్లా నాయక్ కు తెలియదు. అంతేకాదు డానియల్ శేఖర్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒక లీడర్ ( సముద్రఖని ) కొడుకు అనే విషయం అస్సలు తెలియదు. విషయం తెలుసుకున్న తర్వాత డానియల్ శేఖర్ కు సారీ చెప్పి విడుదల చేయిస్తాడు భీమ్లా నాయక్. ఇక తనను అరెస్టు చేశాడన్న కోపంతో డానియల్ శేఖర్ భీమ్లా నాయక్ జాబ్ పోయేలా చేస్తాడు. దీంతో డానియల్ శేఖర్ పై కోపం పెంచుకున్నాడు భీమ్లా నాయక్ . చివరికి ఇద్దరి మధ్య యుద్ధం ఎలా ముగిసింది అన్నదే కథ. పవన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధం భీమ్లా నాయక్ సినిమా.

ఎవరు ఎలా చేసారంటే : ఎన్నోసార్లు పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం భీమ్లా నాయక్ సినిమాలో కూడా విశ్వరూపం చూపించేశాడు ఇక ప్రతి పాత్రకి ప్రాణం పోసే రానా డేనియల్ శేఖర్ గా ఒదిగిపోయాడు. వీరిద్దరి మధ్య అన్ని సన్నివేశాలు ఆడియన్స్ కి గూస్బంప్స్ తెప్పిస్తాయ్ అని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ సరసన నటించిన నిత్య మీనన్ పాత్ర కూడా ఎంతో బలంగా ఉంది. ఇక సంయుక్త మీనాన్ కూడా పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. సముద్రఖని, రావురమేష్, మురళీకృష్ణ లు తమ పాత్రల మేరకు బాగా నటించారు. ఇక చివర్లో బ్రహ్మానందం అలా కనిపించి ఇలా వెళ్ళిపోతారు.

ప్లస్ పాయింట్లు :

1.పవన్ కళ్యాణ్, రానా, నిత్యమీనన్ పర్ఫామెన్స్
2.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
3. స్క్రీన్ ప్లే డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ కొద్దిగా స్లో గా ఉండటం

మొత్తంగా చూసుకుంటే అటు అయ్యప్పనుమ్ కోషియం తో పోల్చి చూస్తే ఇక భీమ్లా నాయక్ లో దర్శకుడు బాగా మార్పులు చేశాడని అనిపిస్తుంది. పవన్కళ్యాణ్ రానా మధ్య ఉండే డైలాగులు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆకలి తీర్చేందుకు ఎలాంటి సినిమా కావాలో ఇక అలాంటి సినిమానే భీమ్లా నాయక్ అని చెప్పొచ్చు.

రేటింగ్ : 3.25/5.

Share post:

Latest