భీమ్లా నాయ‌క్ రిలీజ్‌కు ముందే ఫ్యాన్స్‌కు బిగ్ డిజ‌ప్పాయింట్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా విమర్శించడానికి ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌ను కూడా కొంద‌రు, కొన్ని పార్టీల వాళ్లు బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు. వ‌కీల్ సాబ్ సినిమా టైం నుంచే టిక్కెట్ల ధ‌ర‌లు నియంత్ర‌ణ ఏపీలో స్టార్ట్ అయ్యింది. అప్ప‌టి నుంచే ప‌వ‌న్‌ను ఏపీలో కొంద‌రు టార్గెట్ చేస్తున్నారు. అయితే అన్ని సార్లు ప‌వ‌న్‌ను కావాల‌నే టార్గెట్ చేయ‌రు కాని.. కొన్నిసార్లు సినిమాల విష‌యంలో ఆయ‌న వేస్తోన్న రాంగ్‌స్టెప్పులు కూడా ఆయ‌న‌ను ట్రోలింగ్ చేయ‌డానికి కార‌ణం అవుతున్నాయి. ఓ భాష‌లో ప్లాప్ అవ్వ‌డం లేదా ఎవ‌రికి న‌చ్చ‌క‌పోయిన సినిమాల‌ను కూడా తెలుగులో ఎందుకు రీమేక్ చేస్తున్నారో అర్థం కాని ప‌రిస్థితి.

ఇక తాజాగా ఆయ‌న చేసిన భీమ్లానాయ‌క్ మ‌రో మూడు రోజుల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరో.. పైగా సినిమాలో రానా కూడా ఉన్నాడు.. ఆల్రెడీ మ‌ళ‌యాళంలో హిట్ అయ్యింది.. ఇలాంటి టైంలో సినిమాపై ఎంత అంచ‌నాలు ఉండాలి.. అవేవి లేవు. ట్రైల‌ర్ రిలీజ్ అయ్యి తుస్సుమ‌నిపించేసింది. ట్రైల‌ర్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే రానా డామినేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇక అఖండ‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేట‌ర్ల‌లో సినిమా చూసే వారికి థ‌మ‌న్ పూన‌కాలు తెప్పించాడు.

కానీ భీమ్లానాయ‌క్ ట్రైల‌ర్ చూస్తే స‌గ‌టు సినీ అభిమానికే కాదు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కే నీరసం తెప్పించింది. అస‌లు అంచనాలు ఏ మాత్రం అందుకోలేద‌ని ప‌వ‌న్ వీరాభిమానులే నిట్టూరుస్తున్నారు. ఇక ఫైట్లు అంత‌గా ఎలివేట్ కాలేదు. ట్రైల‌ర్ కూడా ఏ మాత్రం కొత్త‌ద‌నంతో లేదు. క‌నీసం టేకింగ్ ప‌రంగా కూడా ఆక‌ట్టుకోలేదు. ఇక సీన్ల ఎలివేష‌న్ గురించి ఎంత త‌క్కువుగా చెప్పుకుంటే అంత‌మంచిది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తేలిపోయింది.https://youtu.be/m8v-qYaiWzw[/embed]

ఇక ప‌వ‌న్ గ‌త సినిమాలు ఎలా ఉన్నా క‌నీసం సాంగ్స్ అన్నా ముందు సినిమాకు హైప్ తెచ్చేవి. ఇప్పుడు ఈ సినిమా సాంగ్స్ కూడా ప‌వ‌న్ వీరాభిమానుల‌కే గుర్తులేని ప‌రిస్థితి. పైగా రీమేక్ సినిమా.. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ చాలా మంది చూసేశారు. ఏదేమైనా భీమ్లానాయ‌క్ ట్రైల‌ర్‌తో అయితే అంద‌రిని డిజ‌ప్పాయింట్ చేశాడు. మ‌రి సినిమా కూడా అలాగే ఉంటుందా ? లేదా ట్రైల‌ర్‌కు భిన్నంగా ఉంటుందా ? అన్న‌ది చూడాలి.https://youtu.be/Enzj9nTHiEc[/embed]

Share post:

Latest