ఫస్ట్ డే భీభత్సం సృష్టించిన భీమ్లా నాయ‌క్..ఏంది సామి ఈ ఊచకోత..?

సాగర్ చంద్ర డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి విలన్ గా నటించిన చిత్రం..”భీమ్లా నాయ‌క్”. ఎప్పటినుండో ఈ సినిమా కోసం అభిమానులతో పాటు బడా స్టార్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా ..నిన్న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు, సాధారణ ప్రేక్షకులు భీమ్లా నాయ‌క్ సినిమాకి పోటెత్తారు. దీంతో భీమ్లా నాయక్ సినిమా థియేటర్ల వద్ద దుమ్మురేపుతోంది. అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు రానా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది.

ఇక అమెరికాలో అయితే ఎప్పుడు లేనివిధంగా ఫిబ్ర‌వ‌రి 24నే ‘భీమ్లా నాయ‌క్’ ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. దీంతో ప్రీమియ‌ర్ షోస్ వల్లనే దాదాపు 867000 డాల‌ర్స్‌గా ట‌చ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇది శుక్ర‌వారానికి వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ను ట‌చ్ చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఓవర్సీస్ నుండి రూ. 50-55 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక యూకేలో ఈ చిత్రం 87 వేల పౌండ్లను వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో 88 లక్షలు వసూలు చేసింది. ఐర్లాండ్‌లో 7 లక్షల రూపాయల వరకు రాబట్టింది

ఇక తొలిరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయ‌క్ సినిమా ధియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిచ్చాయి. ఇక ఫస్ట్ డే భీమ్లా నాయ‌క్ 26 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక నైజాంలో అయితే ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. పుష్ప సినిమా రికార్డ్ ని బీట్ చేస్తూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. తొలి రోజు భీమ్లా నాయ‌క్ సినిమా ఏకంగా రు 11.80 కోట్ల షేర్ రాబట్టిన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే దాదాపు34 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు భీమ్లా నాయ‌క్. ఇక ప్రజంట్ సిట్యువేషన్స్ చూస్తుంటే.. మొదటి వీకెండ్ అయ్యేలోపే పవన్-రానాల మూవీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share post:

Latest