అలనాటి హీరోయిన్ పూర్ణిమ.. ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంటి?

నటి పూర్ణిమ మీకు గుర్తుండే ఉంటుంది.. ఏంటి మర్చిపోయారా.. తప్పు లేదు లేండి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైన చాలా ఏళ్లు గడిచిపోతున్నాయి.. మరి ఆమె సినిమాల పేరు చెప్తే మాత్రం నటి పూర్ణిమ తప్పకుండా మీకు గుర్తొస్తుంది.. ఇంతకీ ఆమె టాలీవుడ్ లో ఏం సినిమాల్లో నటించింది అంటారా.. అనగనగా 40 ఏళ్ల క్రితం వచ్చిన జంధ్యాల ముద్దమందారం సినిమాలో హీరోయిన్ గా నటించింది పూర్ణిమ. చూడ చక్కనైన మొఖం ఆకట్టుకునే సౌందర్యం బక్కపలచగా పొట్టిగా చిన్నపిల్లల కనిపించేది. అయితే నేమ్ సినిమాలో తన నటనతో ఎంతోమంది విమర్శకులను సైతం మెప్పించి ప్రశంసలు అందుకుంది.

అంతేకాదు ఇక అటు జంధ్యాలకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత జంధ్యాల తెరకెక్కించిన నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ సినిమాల్లోనూ ఇక హీరోయిన్ గా పూర్ణిమనే సెలెక్ట్ చేసారు జంధ్యాల.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న పూర్ణిమ ఇక ఆ తర్వాత సినిమాల్లో రాణించకుండా ఉంటుందా.. ఇక ఈ రెండు సినిమాలకూ కూడాప్రేక్షకుల ఆదరణ బాగానే వచ్చింది. అటు కోడిరామకృష్ణ దర్శకత్వంలో కూడా పలు సినిమాల్లో నటించింది పూర్ణిమా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అయితే పూర్ణిమ కెరియర్లో 60కి పైగా సినిమాలు చేస్తే హిట్ అయినవి మాత్రం కోడి రామకృష్ణ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు మాత్రమే అని చెప్పాలి.

అదంతా ఓ కే గానే ఇప్పుడు పూర్ణిమ గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్.. చిత్ర పరిశ్రమకు దూరమైన పూర్ణిమ ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమం లో ప్రత్యక్షమయ్యింది. కానీ ఈమె నిజంగా పూర్ణిమ అని నమ్మలేక పోతున్నారు అభిమానులు. ఎందుకంటే అప్పుడు అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే పూర్ణిమ ఇక్కడ ఇప్పుడు 56 ఏళ్ళకే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఆమెకు మేకప్ ఎవరు వేసారో గానీ.. లోలోపల చాలానే తిట్టుకుంటున్నారు. ఇప్పుడు అవకాశాలు వస్తే చేయడానికి రెడీగా ఉంది పూర్ణిమ. కానీ ఇలాంటి మేకప్ లో చూసిన తర్వాత ఏ దర్శకుడు ఛాన్స్ ఇస్తాడు అని మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఆలీతో సరదాగా కార్యక్రమంలో ప్రత్యక్షమై అభిమానులు అందరినీ అవాక్కయ్యేలా చేసింది అలనాటి నటి పూర్ణిమ.

Share post:

Latest