చాలా సార్లు అలా చేసుకోవాలనిపించింది..ఎందుకో తెలియదు.. హాట్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!!

ఎవ్వరికి డబ్బుల్లు ఊరికే రావు..ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. నిజమే ఎవ్వరికి డబ్బులు ఊరికే రావు. పది రూపాయిలు సంపాదించాలన్నా మనం కష్టపడితేనే వస్తుంది. అలా కష్టపడి సంపాదించనవాడికే ఆ రూపాయి ఒక్క విలువ తెలుస్తుంది. ఇక సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావలన్నా అంతే. ఇంట్లో కాళ్లు మీద కాళ్ళు వేసుకుని కూర్చోని ఉంటే ఎవ్వరికి అవకాశాలు రావు. ట్రై చేయలి ఆడిషన్స్ కు వెళ్ళాలి..వాళ్లు చెప్పిన్నట్లు చేయాలి. అప్పుడు అరా కొరా ఆఫర్లు వస్తాయి..దాని ద్వార మనలోని టాలెంట్ ను చూయిస్తూ పై పైకి ఎదగాలి.

ఇక ఇలాగే ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి..రాత్రి పగలు కష్టపడి..ఎన్నో బాధలు..మరెన్నో అవమానులు..భరించి..ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి..ఫైనల్ గా తను అనుకున్న గమ్యానికి చేరుకుంది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు అందాల తార మృణాల్ ఠాకూర్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందంతో పాటు నటనను ఈక్వెల్ గా బ్యాలెన్స్ చేస్తూ..తనకు తానే పోటీ అన్నట్లుగా బాలీవుడ్ లో దూసుకుపోతుంది.

హృతిక్ రోషన్ పక్కన సూపర్ 30 సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించి బడా బడా హీరోల పక్కన ఛాన్స్ కొట్టెస్తున్న ఈ అమ్మడు..రీసెంట్ ఇంటర్వ్యుల్లో తను ఇండస్ట్రీకి రాకముందు పడిన విషయాల గురించి చెప్పుతూ ఎమోషనల్ అయ్యింది. కెరీర్ స్టార్టింగ్ లో ఇంటినుండి దూరంగా వచ్చేసిన ఆమె.. ముంబై మహా నగరంలో ఒంటరిగా జీవించానని..ఆ టైంలో ఆమె పడిన బాధలు, కష్టాలు చెప్పుకోలేనివని చెప్పుతూ..ఆ బాధలను ఫేస్ చేయలేక చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది.

ఇక ఆమె చదువుకునే రోజుల్లో అయితే ప్రతి రోజూ కూడా లోకల్ ట్రైన్ లోనే తిరిగేదట.. ఇక ఆ టైంలో ట్రైన్ లో కూర్చుందామన్నా ఒక్క సీటు దొరికేది కాదని.. ఆ టైంలో ఎందుకో తెలియదు సడెన్ గా ట్రైన్ లోనుంచి దూకేయాలనిపించేదని చెప్పుకొచ్చింది మృణాళిని. అలా ఎన్నో బాధలు కష్టాలు చూసిన మృణాల్ ఠాకూర్..ఇప్పుడు బాలీవుడ్ బడా హీరోల సరసన నటిస్తుంది. ఇక త్వరలోనే అమ్మడు తన అందాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు సినిమా లెఫ్టినెంట్ రామ్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Share post:

Latest