IPL 2022 వేలంలో టాప్ లేపిన క్రికెట‌ర్లు.. భారీ రేట్లు..?

IPL 2022 మెగావేలం బెంగ‌ళూరులో కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అప్‌డేట్స్‌ను బ‌ట్టి చూస్తే శ్రేయాస్ అయ్య‌ర్‌ను కోల్‌కొత్తా రు 12.25 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఈ రోజు రు. 10 కోట్లు వేలంలో ప‌లికిన ఒకే ఒక్క ఆట‌గాడిగా శ్రేయాస్ అయ్య‌ర్ రికార్డుల‌కు ఎక్కారు. అయ్య‌ర్ కోల్‌కొత్తా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఇక మిగిలిన వారిలో ప్యాట్ క‌మిన్స్ రేటు రు 7.25 కోట్ల‌కు ప‌లికింది. క‌మిన్స్ రేటు గ‌త ఐపీఎల్‌తో పోల్చి చూస్తే 15.50 కోట్ల నుంచి 7.25 కోట్ల‌కు త‌గ్గి పోయింది.

ఇక స్పిన‌ర్ ర‌విచంద్ర అశ్విన్ కోసం కూడా గ‌ట్టిపోటీ నెల‌కొంది. అశ్విన్ రు. 5 కోట్ల‌కు రాజ‌స్తాన్ సొంతం చేసుకుంది. రు. 2 కోట్ల బేస్ రేటుతో ఉన్న క‌గిసో ర‌బ‌డాను పంజాబ్ సొంతం చేసుకుంది. ఇందుకోసం పంజాబ్ ఏకంగా రు. 9 కోట్లు పెట్టింది. ఇక క్వింట‌న్ డికాక్‌ను ల‌క్నో రు 6.75 కోట్ల‌కు సొంతం చేసుకుంది. గుజరాత్ మ‌హ్మ‌ద్ ష‌మిని 6.25 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

ఇక ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ను 6.25 కోట్ల‌కు ల‌క్నో సొంతం చేసుకుంది. ఈ రోజు వేలంలో తొలి అట‌గాడిగా ఉన్న ధావ‌న్‌ను ధాన‌వ్ 8.25 కోట్ల‌కు పంజాబ్ సొంతం చేసుకుంది. ధావ‌న్ పంజాబ్ కెప్టెన్ రేసులో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌల‌ర్ ట్రెంట్ ను బౌల్ట్ రు. 8 కోట్ల‌కు రాజ‌స్తాన్ సొంతం చేసుకుంది. గ‌తంలో ముంబై విజ‌యాల్లో బౌల్ట్‌ కీల‌కంగా నిలిచాడు.

Share post:

Latest