క్రేజీ కాంబినేషన్.. ఆ సినిమాలో తండ్రీకొడుకులుగా వెంకటేశ్-రానా?

ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ హీరోల సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సింగిల్ గా సినిమా తీయడం కంటే మరో హీరోతో కలిసి సినిమా తీయడానికే అందరూ ఆసక్తి చూపుతున్నారు. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంతేకాదండోయ్ ఇక మరోవైపు తండ్రీకొడుకుల ట్రెండ్ కూడా ఎక్కువైపోయింది. టాలీవుడ్లో ఇటీవలే బంగార్రాజు సినిమాతో అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఆచార్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించబోతున్నారు.

 

గతంలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు.. తర్వాత మహేష్ బాబు గౌతమ్ లు కూడా కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నో మలయాళ చిత్రాలను తెలుగులోకి రీమేక్ చేస్తూ సూపర్ హిట్ అనుకుంటున్నారు టాలీవుడ్ హీరోలు. మలయాళంలో మోహన్లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన ‘బ్రో డాడీ’ సినిమా తెలుగులో రీమేక్ చేయనుండగా.. దగ్గుబాటి వారసుడు వెంకటేష్ రానా కలిసి నటించబోతున్నాట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ ని వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు దక్కించుకున్నారట.

 

ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ పృథ్వీరాజ్ పాత్రలలో.. వెంకటేష్ రానా సరిగ్గా సరిపోతారని సురేష్ బాబు భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా రీమేక్ లో దగ్గుబాటి వారసులు ఇద్దరు కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా విషయానికి వస్తే కొడుకుని తమ్ముడు గా భావించే తండ్రి.. తండ్రిని అన్నలా భావించే కొడుకు ఇక వీరి మధ్య ఒక చిన్న సమస్య.. ఇక ఈ సమస్య పరిష్కారం కోసం తండ్రికొడుకులు ఏమి చేస్తారు అన్నదే ఈ సినిమాలోని డ్రామా.. ఇప్పటికే వెంకటేష్ వరుణ్ తేజ్, నాగచైతన్యలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటించగా.. ఇక ఇప్పుడు మరో సారి అన్నయ్య కొడుకు రానా దగ్గుబాటి తో కలిసి నటించేందుకు సిద్దమయ్యాడు అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక త్వరలో ప్రకటన రాబోతుందట

Share post:

Latest