బిగ్ బాస్ ఓటిటి.. ఈ సెలబ్రిటీలతో ఈసారి హౌస్ కలర్ ఫుల్?

బిగ్ బాస్ ఓటిటి.. నో కామ.. నో పులిస్టాప్… 24 గంటలు ఎంటర్టైన్ మెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులందరికీ సరికొత్తగా పరిచయం కాబోతోంది బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇది వరకు అయితే బుల్లి తెరపైన బిగ్ బాస్ కార్యక్రమానికి కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇక 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ ఉండడంతో ఇక ఈ షో ఎలా ఉండబోతుంది అని అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక బిగ్ బాస్ ప్రారంభానికి ఎన్నో రోజులు లేకపోవడంతో బిగ్ బాస్ ఓటిటి ఈ సీజన్లో హౌస్ లోకి వెళ్ల పోయే కంటెస్టెంట్ ఎవరు అని గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా లో ఎంతగానో చర్చ జరుగుతుంది.. వీళ్లే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లపోతున్నారు అంటూ కొంతమంది పేర్లు తెగ వైరల్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు ఉన్నటువంటి ఇంటి సభ్యులను, అలాగే కొంత మంది గుర్తింపు పొందిన సెలబ్రిటీలు అందరినీ కలిపి బిగ్ బాస్ ఓటీటి హౌస్ లోకి పంపించేందుకు సిద్ధమయ్యారు బిగ్ బాస్ యాజమాన్యం అని తెలుస్తుంది. మొదటి సీజన్ మినహా అన్ని సీజన్లలో కూడా ఒకరిద్దరు ఫేమస్ సెలబ్రిటీలు అలాగే మిగతా అందరిని సోషల్ మీడియా స్టార్స్ ను కూడా హౌస్ లోకి పంపారు.

కానీ బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో మాత్రం బాగా ఫేమస్ సినీ సెలబ్రిటీలనే హౌస్ లోకి పంపించి పోతున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొంత మంది పేర్లు కన్ఫామ్ అయిపోయాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో సీజన్ వన్ నుంచి కమెడియన్ దన్ రాజ్, ముమైత్ ఖాన్, ఆదర్ష్ ఉండగా.. ఇక సీజన్ 2 నుంచి తనిష్ తేజస్వి, ఇక సీజన్ త్రీ నుంచి ఆశు రెడ్డి సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. సీజన్ ఫోర్ నుంచి అరియనా గ్లోరీ, మహేష్ విట్టా కూడా హౌస్ లోకి వెళ్లి పోతున్నారట.. ఇక సీజన్ 5 నుంచి సరయు, హామీద, నట రాజ్ మాస్టర్ లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక వీళ్ళు కాకుండా యూట్యూబ్ యాంకర్ నిఖిల్, రోల్ రైడ, మిత్ర శర్మ, తనీష్, స్రవంతి చొక్కా రపు, యాంకర్ శివ, RJ చైతు, అనిల్ రాథోడ్, బిందుమాధవి లాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయ్.

ఇక బిగ్ బాస్ OTT లో పాల్గొనడం గురించి గీత మాధురి వంటి వారి మీడియా ముఖంగా పెదవి విరిచారు. ఇక ఈ షో పై నెగటివ్ కామెంట్స్ సైతం వస్తున్నాయి. ఒక గంట చూడాలంటేనే బోర్ కొట్టేస్తున్న షో 24 గంటల పాటు అంటే టైం వేస్ట్ అనే వాళ్ళు లేకపోలేదు. మరి సరికొత్త మరియు విన్నూత ప్రయోగం గా స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేసిన బిగ్ బాస్ ని జనాలు ఆదరిస్తారా లేక తిప్పి కొడతారా చూడాలంటే మరి కొన్ని రోజుల పాటు ఎదురు చూడాల్సిందే.