బాక్సాఫీస్ వ‌ద్ద భీమ్లానాయ‌క్ ప్ర‌భంజ‌నం.. ఫ‌స్ట్ వీకెండ్‌లో భారీ వ‌సూళ్లు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ – ద‌గ్గుబాటి రానా సంయుక్తంగా క‌లిసి న‌టించిన సినిమా భీమ్లానాయ‌క్‌. శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. టిక్కెట రేట్లు కాస్త త‌క్కువుగా ఉన్న ఏపీ వ‌దిలేస్తే నైజాం, ఓవ‌ర్సీస్‌, రెస్టాఫ్ ఇండియాలో భారీ వ‌సూళ్ల‌తో భీమ్లాస‌రికొత్త రికార్డులు న‌మోదు చేస్తోంది. ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ల‌తోనే మిలియ‌న్ మార్క్‌కు చేరువ అయిన భీమ్లా ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికే ఏకంగా 2 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది.

ఇక నైజాంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ సినిమా ఆదివారం మూడో రోజు రు. 6 కోట్లు వ‌సూలు చేసింది. తొలి రోజు రు. 12, రెండో రోజు రు. 7.5 కోట్లు వ‌సూలు చేసిన ఈ సినిమా మూడో రోజు కూడా రు. 6 కోట్లు కొల్ల‌గొట్ట‌డంతో ఓవ‌రాల్‌గా రు. 20 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే ఆంధ్రా, సీడెడ్‌లో వ‌సూళ్లు త‌గ్గ‌డంతో కాస్త క‌లెక్ష‌న్లు డ్రాప్ అయ్యాయి.

Share post:

Popular