బాలీవుడ్‌ నుంచి పిలుపు..బంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ..?

అనసూయ..అటు వెండి తెర ఇటు బుల్లితెర రెండింటిని రెండు కళ్లులా భావిస్తూ,..రెండింటికి సమానమైన న్యాయం చేస్తుంది. న్యూస్ రీడర్‌గా కెరియర్ ప్రారంభించిన ఆ తర్వాత టీవీ షోలతో పాపులారిటీ సంపాదించింది. జబర్దస్త్ యాంకర్ అనసూయ తెలుగు ఆడియెన్స్ లో ఎలాంటి క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని అలరించిన అనసూయ రోజురోజుకు దూసుకుపోతుంది.

ఓ వైపు తనకు లైఫ్ నిచ్చిన యాంకర్ గా చేస్తూనే..మరో వైపు తనకు పాపులారిటీని ఇచ్చిన సినిమాలను కూడా చేస్తూ స్టార్ హీరోయిన్లకు సైతం దడ పుట్టిస్తుంది. యాంకర్ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని చెప్పిన ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతోంది. నిజానికి అమ్మడుకి ఇప్పుడు హీరోయిన్ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన అనసూయ ..రీసెంట్ గా పుష్ప సినిమాలో..ఆ తరువాత ఖిలాడి సినిమాలో నటించి తన నటనకు మంచి మార్కులే వేయించుకుంది.కాగా తాజాగా అనసూయ కి బాలీవుడ్ నుండి ఓ క్రేజీ ఆఫర్ అందిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ నటించిన పుష్ప సినిమా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాని అందుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాతో బాలీవుడ్ బడా డైరెక్టర్స్ కంట్లో పడిన అనసూయాకు స్టార్ డైరెక్టర్ ఓ క్రేజీ సినిమాలో లెడీ విలన్ రోల్ ఇచ్చిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజం అయితే అనసూయ కెరీర్ ఇక బ్రేకుల్ లేన్నట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరో వైపు చిరంజీవి కొత్త చిత్రం గాడ్ ఫాదర్ లో కూడా నటిస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. రంగస్థలం సినిమా తరువాతనే అమ్మడుకి సినిమా అవకాసాలు ఎక్కువ వస్తున్నాయి.

Share post:

Popular