రొమాంటిక్ మూడ్ లో అనసూయ..భర్తతో హాట్ సరసాలు..మరీ ఇంత డీప్ రొమాన్స్ నా?

ప్రపంచ వ్యాప్తంగా నిన్న వాలెంటైన్స్ డే రోజును ఘనంగా జరుపుకున్నారు ప్రేమికులు. వాలెంటైన్స్ డే అంటే కేవలం ప్రేమికులు మాత్రమే జరుపుకునేది కాదు. మనకిష్టమైన వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తూ వాళ్ళ పై మనకు ఎంత ఇష్టం ఉందో తెలియజేసే రోజే ఈ వాలెంటైన్స్ డే. ఇక ఈ వాలెంటైన్స్ డే ని స్టార్ సెలబ్రిటీలు కూడా తమదైన స్టైల్ లో జరుపుకున్నారు. వెండి తెరకు సంబంధించిన స్టార్ హీరో,హీరోయిన్ లు..బుల్లితెర కు సంబంధించిన యాంకరమ్మలు, సీరియల్ స్టార్స్ అందరూ..వాళ్ళకు ఇష్టమైన వ్యక్తులకు తమ ప్రేమను తెలియజేస్తూ..ఆ ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.

ఇక సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే హాట్ బ్యూటీ జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా తన భర్త భరద్వాజ్ తో కలిసిన దిగిన ఫోటోను షేర్ చేస్తూ..”నీకు ఐ లవ్ యూ చెప్పడానికి మరో రోజు వచ్చింది..హ్యాపీ వాలెంటైన్స్ డే” అంటూ భర్తను గట్టిగా హగ్ చేసుకుని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు .. తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు లవ్లీ కపుల్..మీరు ఎంతో మంది ఆదర్శంగా నిలవాలి అంటుంటే..మరి కొందరు..అనసూయ లుకింగ్ సో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే అమ్మడు తన భర్త తో ఇది వరకు దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటో లో అనసూయ ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్లు ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తన భర్తను ప్రేమగా కొరుకుతున్న ఫోటో..అలాగే అనసూయ ను భరద్వాజ్ ముద్దు పెట్టుకుంటున్న ఫోటో..ఇలా ఆమెకు సంబంధించిన కొన్ని హాట్ రొమాంటిక్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అనసూయా పేరు మరోసారి నెట్టింట మారు మ్రోగిపోతుంది. ఇక సినిమాలు విషయానికి వస్తే అమ్మడు..పుష్ప 2, రంగమార్తాండ’ లో నటిస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం బట్టి..చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది.