ఆ హీరో సినిమాలో నటించడానికి ఇన్ని కండీషన్లా..అనసూయ మరీ ఓవర్ చేస్తుందే..?

అనసూయ..అందానికి అసూయ పుట్టించే అందం ఆమె సొంతం. ఈమె ఇద్దరి బిడ్డలకు తల్లి అంటే తెలియని వారు అస్సలు నమ్మలేరు. అంత పర్ఫెక్ట్ ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తుంది ఈ అమ్మడు. చూడగానే ఎటువంటి వాళ్లనైనా ఆకట్టుకునే విధంగా చీరలు కడుతూ.. జానడు గుడ్డ ముక్కలతోనే కాదు..ఆరు గజాల చీరలో కూడా ఎక్స్ పోజింగ్ చేయచ్చు అని ప్రూవ్ చేసిన హాట్ ముద్దుగుమ్మ. ఎప్పుడు నవ్వుతో చలాకీగా ఉండే అనసూయ..తన కెరీర్ ను బుల్లితెరపై యాంకర్ గా ప్రారంభించింది. మొదట్లో ఈమె పర్ ఫామెన్స్ చూసిన వాళ్ళు అమ్మడుకి అంత సీన్ లేదు అని అనుకున్నా..మెల్లగా డే బై డే ఆమెలోని టాలెంట్ ను ఒక్కొక్కటిగా బయటపెడుతూ.. జబర్దస్త్ బ్యూటీగా ఫేమస్ అయింది.

ఓ వైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న అనసూయ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అలాగే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లు కూడా ఎక్కువే. సినీ ఇండస్ట్రీ అంటేనే పాజిటివిటీ తో పాటు నెగిటివ్స్ కూడా ఫేస్ చేయాలని తెలుసుకోగలిగింది కనుకే అనసూయ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉంది. కానీ కొన్ని సార్లు నెటిజన్స్ కామెంట్స్ హద్దులు దాటుతుంటే భరించలేని ఆమె తనదైన స్టైల్లో ఇచ్చిపడేస్తుంది.

రీసెంట్ గా పుష్ప సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్న అనసూయకి..వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ అమ్మడు ఆచి తూచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే మాస్ రాజ రవితేజ హీరో గా నటిస్తున ఖిలాడి సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి సైన్ చేసింది అనసూయ. దీని పై అఫిషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే అనసూయ ఈ సినిమా స్టోరీ వినగానే ఓకే చేయలేదట..కొన్ని కండీషన్స్ పెట్టి వాటికి ఒప్పుకున్నాకనే సైన్ చేసిందట.

ఫస్ట్ రెమ్యూనరేషన్ విషయంలో అమ్మడు సంతృప్తి చెందలేదట. ఆమె అడిగిన పారితోషకాని ఇవ్వాల్సిందే అని ఖరాకండీగా చెప్పిందట. సెకండ్..సినిమాలో డ్యాన్స్ చేయను..ఒక్కవేళ చేయాలి అంటే దానికి సపరేటుగా డబ్బులు ఛార్జ్ చేస్తా..ధర్డ్ ముందు అనుకున్న కాల్ షీట్లు మాత్రమే ఫిక్స్ అవ్వాలి..ఆ తరువాత ఎక్స్ ట్రా అడిగితే ఇవ్వను..అంటూ కండీషన్స్ పెట్టి వాటికి డైరెక్టర్ ఓకే చెప్పాకనే ఫైనల్ గా సైన్ చేసిందట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్..హిట్ సినిమాలు పడడంతో అమ్మడు బాగా ఓవర్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా అనసూయ క్రమంగా అటు బుల్లితెర పై ఇటు వెండితెరపై ఫుల్ బిజీ అవుతోంది. మరి చూడాలి ఖిలాడి సినిమాలో అమ్మడు పర్ ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో..?