ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్ధితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోలు స్టాండిడ్ గా ఉన్నా..హీరోయిన్లు మాత్రం మారిపోతున్నారు. దీంతో తెలుగు ఇండస్ట్రీలో రోజుకో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఎంత మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇచ్చినా..వాళ్లల్లో మనోళకి నచ్చాలంటే చాలా కష్టం. అని పర్ ఫెక్ట్ గా ఉంటేనే .. ఆ అమ్మడులని హీరోయిన్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన ఓ కుర్ర బ్యూటీ అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా నటించగా, యంగ్ బ్యూటీ డాక్టర్ పిల్ల శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అలా హిట్ కాలేదు ఇలా ఫ్లాప్ కాలేదు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీలీల లేలేత అందాలు అందరిని ఆకర్షించాయి. దానికి తగ్గట్లు అమ్మడు వయసుకు మించిన ఎక్స్ ప్రేషన్స్ ఇస్తూ.. నడుము తిప్పుతూ..డ్యాన్స్ చేస్తుంటే అది చూసిన యువత కి పిచ్చెక్కిపోయింది. దీంతో అమ్మడు పై స్టార్ డైరెక్టర్స్ కళ్లు పడ్డాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల రెండు బడా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన్నట్లు తెలుస్తుంది. అనీల్ రావిపూడి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ కు కూతురిగా శ్రీలీల నటిస్తుందంటూ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేస్తున్న మూవీలోను శ్రీలీల అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తుంది. కామెడీ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ అంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా కుర్ర బ్యూటీ శ్రీలీల ను ఫైనల్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మారుతి..ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ని అనుకున్నారట. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలకు అవకాశం ఇవ్వమని ఓ స్టార్ డైరెక్టర్ మారుతికి ఫోన్ చేసి మరీ చెప్పారట. దీంతో ఆయన మాటను కాదు అనలేక శ్రీలీల కు మెయిన్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైన ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అయినా ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ అందుకోలేని హీరోయిన్లకు శ్రీలీల గట్టి షాకే ఇచ్చింది..మరి చూడాలి ఆరు అడుగుల అందగాడు పక్కన ఈ కుర్ర బ్యూటీ ఏం మాత్రం మెప్పించగలదో..?