Bheemla Nayak: ఆ పాత్రలో కొడాలి నాని నటించి ఉంటే ఎలా ఉండేది..?

ప్రస్తుతం ఎవరి నోట విన్న కాని భీమ్లా నాయక్ పేరే ఎక్కువుగా వినిపిస్తుంది. అంతలా ఈ సినిమా అభిమానులకి రీచ్ అయ్యింది. పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో కనిపించండ ఒక ప్లస్ పాయింట్ అయితే..ఆయన నోటి నుంటి త్రివిక్రమ్ రాసిన మాస్ డైలాగ్స్ వినడం సినిమాకి మాస్ ఎలిమెంట్స్ తో బాగా కలిసి వచ్చాయి. త్రివిక్రమ్ పాత్రను ఉద్దేశించి అలా రాసారో లేక పవన్ వ్యక్తిగత త్రివిక్రమ్ గుర్తుపెట్టుకుని అలాంటి డైలాగ్స్ రాసారో తెలియదు కాని..ప్రతి ఒక పంచ్ అవతలి వాళ్లకి అర్ధమైయేలా..గట్టిగా తగిలేలా రాశారు అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

అయితే, ఈ సినిమా గురించి పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ..పాజిటివ్ గా నే చెప్పుకొస్తున్నారు. కానీ నటి పూనమ్ కౌర్ మాత్రం షాకింగ్ ట్వీట్ చేసింది. దీంతో మళ్ళీ రగడ మొదలైంది. ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటూ వరుస కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఆమె ట్వీట్ చేస్తూ..ఏపీ మంత్రి కొడాలి నాని మీద పూనమ్ కౌర్ కౌంటర్ వేసింది.

ఆమె ట్వీట్ లో ఏం రాసుందంటే..” ఒకవేళ (మతం మార్చుకున్న క్రిస్టియన్) క్యారెక్టర్ లో రానా నటించిన డ్యానియల్ శేఖర్ పాత్రలో .. ఏపీ మంత్రి కొడాలి నాని కనిపించి ఉంటే..ఆంధ్ర ప్రదేశ్ లో భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది”.. అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ వేసింది. దానికి మళ్ళీ జస్ట్ ఫర్ ఫన్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా తగిలించింది. కానీ ఆ తరువాత ఏం అనుకున్నిందో తెలియదు కానీ..మళ్ళీ ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. అప్పటికే ఆ ట్వీట్ ని స్క్రీన్ షాట్స్ తీసుకుని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మొత్తానికి ఈ ట్వీట్ నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. కాగా భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. సరికొత్త రికార్డ్ సృష్టించే దిశగా దూసుకుపోతుంది

Share post:

Popular