తప్పుడు వార్తలు రాసిన వ్యక్తికి చెమటలు పట్టించిన జయచిత్ర..

జయచిత్ర. సెవెంటీస్ లో తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత హీరోయిన్ గా కొనసాగిన భామ. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె నటించిన సోగ్గాడు సినిమా ఇప్పటికీ జనాల మదిలో నిలిచి ఉంది. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. అనంతరం మురళీ మోహన్ తో కలిసి పలు సినిమాలు చేసింది. వాటిలో ప్రధానంగా చిల్లరకొట్టు చిట్టెమ్మ, కల్పన సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా చక్కగా రాణించింది ఈ అమ్మడు.

- Advertisement -

తాజాగా తన కెరీర్ కు సంబంధించిన పలు విషయాల గురించి వెల్లడించింది ఈ అలనాటి అందాల తార. తను మురళీ మోహన్ తో సినిమాలు చేసే సమయంలో ఆయన నేనంటేనే కాస్త భయపడే వాడని చెప్పింది. ఓ సినిమా షూటింగులో నా చెయ్యి పట్టుకోవడానికి చాలా భయపడినట్లు వెల్లడించాడు. అప్పుడు ఆయన చేతిని నేను పట్టుకున్నానని చెప్పింది. ఇదంతా నటన అని.. భయం అవసరం లేదని తనకు చెప్పినట్లు వెల్లడించింది. కెరీర్ మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత ఇద్దరం కలిసి పలు సినిమాలు చేసినట్లు చెప్పింది.

మురళీ మోహన్ తో కలిసి పలు సినిమాలు చేయడం మూలంగా అప్పట్లో తమ గురించి చాలా రూమర్స్ వచ్చాయన చెప్పింది. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా కొన్ని పత్రికలు రాసినట్లు వెల్లడించింది. ఓ సినిమా షూటింగ్ కకోసం దాసరితో కలిసి తాము విమానంలో వెళ్లామని చెప్పింది. అప్పుడు దాసరి ఆ వార్తను చూపించి ఏమయ్యా.. మురళీ.. జయచిత్రను పెళ్లి చేసుకుంటున్నావట అని అడిగాడు. ఆ మాటతో తాము షాక్ అయినట్లు చెప్పింది. ఆ తర్వాత ఈ వార్త రాసిన వ్యక్తికి చుక్కలు చూపించినట్లు జయచిత్ర వెల్లడించింది. మమ్మల్ని అడగకుండా ఇష్టం వచ్చినట్లు వార్తలు ఎలా రాస్తావు.? అంటూ మండిపడినట్లు చెప్పింది. ఏ ప్రూప్ లేకుండా నచ్చింది ఎలా పబ్లిష్ చేస్తారు? అని నిలదీసినట్లు చెప్పింది. మీ ఇంట్లో వారి గురించి కూడా ఇలాగే తప్పుడు వార్తలు రాస్తావా? అని కోప్పడ్డంతో తను సారీ చెప్పినట్లు వెల్లడించింది. బ

Share post:

Popular