స‌మంత – చైతు… ముందుగా విడాకులు కోరింది ఎవ‌రంటే…!

నాగార్జున కుమారుడు యంగ్ హీరో నాగ‌చైత‌న్య‌, స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల తంతు ముగిసి నాలుగైదు నెల‌లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ ఈ విడాకుల గురించి ఏదో ఒక వార్త మీడియాలో, సోష‌ల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటోంది. ఈ విడాకుల వ్య‌వ‌హారంపై నాగార్జున ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. నాగ్ – నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి వ‌చ్చి హిట్ అయ్యింది. బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ జోష్‌లో ఉన్న నాగార్జున సినిమాను బాగా ప్ర‌మోట్ చేస్తూ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే స‌మంత‌తో చైతు విడిపోవ‌డానికి దారితీసిన ప‌రిస్థితుల‌పై నోరు విప్పుతున్నాడు. త‌న తాజా ఇంట‌ర్వ్యూలో నాగార్జున ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించాడు. అస‌లు వాళ్లిద్ద‌రి మ‌ధ్య విడిపోవాల్సినంత స‌మ‌స్య కూడా ఏదీ లేద‌ని.. కేవ‌లం విడిపోవాల‌న్న స‌మంత నిర్ణ‌యం గౌర‌వించేందుకే చైతు విడాకుల‌కు అంగీక‌రించాడు అని నాగ్ చెప్పాడు. నాగ‌చైతన్య నుంచి విడిపోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చాకే స‌మంత ఆ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింద‌న్నాడు.

అయితే స‌మంత నిర్ణ‌యాన్ని గౌర‌వించే క్ర‌మంలోనే చైతు విడాకుల‌కు ఓకే చెప్పాడ‌ని నాగ్ తెలిపాడు. వాస్త‌వానికి వాళ్లిద్ద‌రు ఎంతో ప్రేమ‌తో ఉండేవార‌ని చెప్పిన నాగ్‌.. నాలుగేళ్ల జీవితంలో వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవార‌ని చెప్పాడు. గ‌తేడాది కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు కూడా వారిద్ద‌రు క‌లిసి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేశార‌ని.. అస‌లు వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఎందుకు స‌మ‌స్య వ‌చ్చిందో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పిన నాగ్‌… విడిపోవాల‌న్న నిర్ణ‌యం ముందుగా తీసుకుంది మాత్రం స‌మంతే అని చెప్పాడు.

అయితే విడాకుల విష‌యాన్ని తాను ఎలా ? తీసుకుంటానా ? అని చైతు చాలా బాధ‌ప‌డ్డాడు ? అని… ఆ బాధే చైతులో ఎక్కువుగా క‌నిపించింద‌ని చెప్పాడు. కుటుంబ ప‌రువు, మ‌ర్యాద ఏమైపోతుందో ? అన్న ఆవేద‌న త‌న కుమారుడిలో క‌నిపించింద‌ని నాగ్ తెలిపాడు. ఏదేమైనా స‌మంత‌తో విడాకుల త‌ర్వాత ముందు మౌనంగా ఉన్న నాగ్ ఆ త‌ర్వాత వ్యూహాత్మ‌కంగానే ఒక్కో విష‌యం రివీల్ చేస్తూ వ‌స్తున్నాడు.

Share post:

Popular