హిస్టారికల్ ఫిల్మ్స్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టిప్స్.. !

ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ను చూపించే వారు. అక్కడి సినిమాలు మాత్రమే దేశ వ్యాప్తంగా డబ్బై విడుదల అయ్యేవి. వాటిని నార్త్ తో పాటు సౌత్ లోనూ జనాలు బాగానే ఆదరించేవారు. ప్రస్తుతం ఈ సీన్ కాస్త రివర్స్ అయ్యింది. బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేసింది. తెలుగు హీరోలు పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నారు. దర్శకులు సైతం తమ అద్భుత టాలెంట్ తో బాలీవుడ్ సినిమాలను తలదన్నే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. మిగతా సినిమా పరిశ్రమలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ను అలరిస్తున్నాయి. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ సత్తా ఓ రేంజిలో పెరిగిపోయింది. ఈ సినిమా అనంతరం చాలా మంది దర్శకులు పాన్ ఇండియన్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తెలుగు హీరోలకు సైతం బీభత్సంగా మార్కెట్ పెరిగిపోతుంది. టాలీవుడ్ నటులు బాలీవుడ్ నటులను సైతం వెనక్కినెట్టి ముందుకు వెళ్లే పరిస్థితి నెలకొంది.

తాజాగా రిలీజ్ అయిన పుష్ప సినిమా సైతం పాన్ ఇండియన్ మూవీగా జనాలను అలరిస్తుంది. హిందీ సినిమాలను మించి వసూళ్లను సాధిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సినిమాలను బీట్ చేయడం అంత సులభం కాదంటున్నాడు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్. అటు తెలుగు సినిమాలు హిందీలో డబ్బై విడుదలైనా ఓ రేంజిలో ప్రజాదరణ అందుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు కథలతో పాటు తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్.. ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా పాపులర్ ఆడియో సంస్థ టిప్స్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది. తాజాగా పవన్ కల్యాణ్, క్రిష్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లుతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమా ఆడియో రైట్స్ ను తీసుకుంది. ఈ రెండు సినిమాలు కూడా చారిత్రక సినిమాలు కావడం విశేషం.