సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచిన ముదురు భామ..

సోనియా అగర్వాల్.. 7/G బృందావన కాలని సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తన నటనకు తెలుగు జనాలు బాగానే అట్రాక్ట్ అయ్యారు కూడా. అందంతో పాటు అభినయంతో జనాలను అలరించింది. తొలి సినిమానే మంచి విజయం అందుకోవడంతో ఆమెకు మరిన్ని అవకాశాల వస్తాయని చాలా మంది అనుకున్నారు. కానీ పెద్దగా రాలేదు. వచ్చిన అవకాశాలను కూడా అందిపుచ్చుకోలేదు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తొలి సినిమా విజయం తర్వాత దర్శకుడు సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడింది ఈ అందాల ముద్దుగుమ్మ. తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా.. తను అంతగా పట్టించుకోలేదు. క్యూట్‌ క్యూట్‌ గా కనిపించే ఈ భారీ అందాల భామ ప్రేమకు తను కూడా ఓకే చెప్పాడు. దీంతో 2006లో వీరి వివాహం అయ్యింది. దీంతో కొంతకాలం పాటు తను సినిమాలకు దూరం అయ్యింది. అయితే పెళ్లి తర్వాత వీరి కాపురం అంత సజావుగా జరగలేదు. కొంత కాలం తర్వాత తనతో వేగలేను అనుకుందట. చివరకు తన నుంచి విడిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే.. తన జీవితం అంతా శూన్యంగానే కనిపించింది. ప్రస్తుతం మళ్లీ తన గ్లామర్ డోస్ ను పెంచింది. కొన్ని తమిళ, కన్నడ సినిమాలు చేసింది. అయినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

సినిమా పరిశ్రమలో తనకున్న పరిచయాలతో ఒకటి రెండు సినిమాలు చేస్తూ కెరీర్ ను ముందుకు నడిపిస్తోంది. అయితే లేటు వయసులోనైనా ఘాటుగా అందాలను చూపిస్తోంది ఈ ముదురు భామ. వయసు పెరుగుతున్నా.. తరగని అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పలు రకాల ఫోటో షూట్లతో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమా చాన్సుల కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికైనా తనకు మంచి అవకాశాలు వస్తే.. గతంలో చేసిన తప్పును రిపీట్ చేయకుంగా కెరీర్ ను బిల్డప్ చేసుకునేందుకు రెడీ అవుతుంది.