వెండి తెరపై ఫట్.. బుల్లితెరపై సూపర్ హిట్..

కొన్ని సినిమాలు మంచి కథతో తెరకెక్కినా జనాలకు అంతగా ఎక్కవు. అందుకే థియేటర్స్ లో విడుదలైనా పెద్ద గుర్తింపు తెచ్చుకోవు. యావరేజ్ టాక్ అందుకుంటాయి. అవే సినిమాలు బుల్లితెరపై మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఓ రేంజిలో రేటింగ్ సాధించిన టాప్ పొజిషన్ సాధిస్తాయి. అలా ధియేటల్స్ లో ఫ్లాపై..టీవీల్లో బ్లాక్ బస్టర్లుగా పేరు తెచ్చుకున్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

*ఓంకారం
రాజశేఖర్, ప్రేమ హీరో, హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. 1997లో రిజలీ అయిన ఈ సినిమా.. తాజాగా వచ్చిన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలను మిక్స్ చేసినట్లు ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు. అయితే ఆ తర్వాత టీవీలో టెలీకాస్ట్ అయి మంచి రేటింగ్ సంపాదించుకుంది. థియేటర్లో ఫ్లాప్ అయిన సినిమా బుల్లితెరపై మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.

*ఆరెంజ్
రాంచరణ్ నటించిన ఈ సినిమా మగధీర తర్వాత విడుదల అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర తర్వాత ఈ సినిమా రావడంతో ఆ సినిమాను మంచి ఈ సినిమాపై జనాలు అంచనాలను పెంచుకున్నారు. కానీ ఈ సినిమా జనాలకు ఎక్కలేదు. ఫలితంగా థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

*నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్
రవి తేజ నటించిన ఈ సినిమాను ఆడియన్స్ కు తమ స్కూల్, కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటారు. మంచి కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయినా ఎందుకో థియేటర్స్ లో బాగా ఆడలేదు.

*ఖలేజా
మహేష్ బాబు, అనుష్క నటించిన ఈ సినిమా కూడా ఫ్లాప అయ్యింది. సినిమా బాగానే ఉన్నా జనాలకు ఎందుకు ఎక్కలేదో అర్థం కాదు. మొత్తానికి ఈ సినిమాను జనాలు అంతగా ఆదరించలేదు.

*వేదం
అల్లు అర్జున్ నటించిన మూవీ వేదం. ఇందులో అనుష్క, మనోజ్ కూడా కీలక పాత్రలు పోషించారు. అయినా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. యావరేజ్ మూవీగా నిలిచింది.

Share post:

Popular