గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రన్ రాజా రన్ బ్యూటీ..

సీరత్ కపూర్.. నార్త్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమలోకి దిగుమతి అయిన ముద్దుగుమ్మ. రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో ఆమె నటన అదుర్స్ అనిపించింది. అంతేకాదు.. ఈ చిత్రంలోని బుజ్జి మా బుజ్జి మా అనే పాట అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించేది. ఈ సినిమాతోనే తెలుగు సినీ అభిమానులకు బాగా దగ్గరైంది సీరత్. ఆ తర్వాత రాజుగారి గది-2 సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇందులోనూ బాగానే నటించింది. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.

రాజుగారి గది-2 సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సీరత్ సినీ కెరీర్ కూడా అంతగా ముందుకు సాగలేదు. పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. దీంతో తన చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం తను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ రంగరించిన ఫోటోలను తను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు.. సినిమా అవకాశాల కోసం ఈ ఫోటోలను వాడుకునే ప్రయత్నం చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తను ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన తొలి తెలుగు సినిమా రన్ రాజా రన్ లో కాస్త బొద్దుగా ఉన్నా చాలా ముద్దుగా కనిపించింది. అయితే ప్రస్తుతం తను షేర్ చేసిన ఫోటోల్లో బాగా బక్కచిక్కిపోయింది. సైజ్ జీరోలా మారింది. గతంతో పోల్చితే ప్రస్తుతం అందహీనంగా కనిపిస్తుంది. ఆమె ఫోటోలను చూసిన నెటిజన్లు ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా తయారయ్యావ్? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు.. ఇలా ఉండే సినిమా అవకాశాలు రావడం కష్టం అని కూడా అంటున్నారు. వెంటనే ఈ రూపాన్ని మార్చుకోకపోతే.. వచ్చే అవకాశాలు కూడా వెనక్కిపోతాయని భయపెడుతున్నారు. చూద్దాం తన లేటెస్ట్ అవతారంపై ఈ ముద్దుగుమ్మ ఏం చెప్తుందో..