సమంత – చైతన్య విడాకులు.. నిలిచిపోయిన క్రేజీ ప్రాజెక్ట్?

ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో కొనసాగి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది సమంత నాగచైతన్య జంట. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు ఇక పెళ్లి తర్వాత కూడా ఎవరికి వారు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఒకానొక సమయంలో ఈ రియల్ లైఫ్ భార్య భార్య భర్తలు రీల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలుగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇలా తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ గా కొనసాగుతున్న నాగచైతన్య సమంత ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నాము అంటూ ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేశారు. మా ఇద్దరి దారులు వేరే అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పేశారు.

ఇక విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఎక్కడ విడాకుల గురించి ఆలోచించకుండా ఎవరికివారు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి నాగచైతన్య బంగార్రాజు సినిమాలో నటించాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మరోవైపు సమంత ఇటీవలే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో యూత్ అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయింది. మరిన్ని సినిమాలతో దూసుకుపోతోంది.

టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ జంట విడాకులు తీసుకోవడం తో ఫ్యూచర్ లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం మాత్రం దాదాపు కష్టమే. ఇకపోతే వీరిద్దరి విడాకుల కారణంగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందట. ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ నగర్లో ఈ టాక్ చక్కర్లు కొడుతోంది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి మజిలీ మూవీ తో నాగచైతన్య సమంత రీల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలుగా చూపిస్తూ ఒక మంచి లవ్ స్టొరీ ని ప్రేక్షకులకు చూపించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని నందినీరెడ్డి భావించారట. ఈ సినిమాకు నాగచైతన్య సమంత గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఈ జంట విడాకులతో విడిపోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయినట్లే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన టాక్ మాత్రం వైరల్ గా మారిపోయింది.

Share post:

Popular