పుష్పలో అవకాశం వచ్చినా వదులుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?

పుష్ప.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అన్ని చోట్లా భారీగా వసూళ్లను చేపట్టింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, సీన్లు, డైలాగులు ఓ రేంజిలో ఫేమస్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నా.. పలువురు వదులుకున్నారు. అందులో కొందరు డేట్లు ఖాళీగా లేక వదులుకుంటే.. మరికొందరు ఇంట్రెస్ట్ లేక నో చెప్పారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకోవడంతో వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నామా? అని పలువురు బాధపడుతున్నారు. ఇంతకీ ఈ సినిమాకు నో చెప్పి బాధపడుతున్న స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పుష్ప సినిమా హీరోగా తొలుత మహేష్ బాబును అనుకున్నాడట సుకుమార్. వెళ్లి ఆయనకు కథ కూడా చెప్పాడట. అయితే ఈ సినిమాలో లుక్స్ పరంగా ఛేంజ్ కావాల్సి ఉండటం, అదే సమయంలో వేరే సినిమాల్లో బిజీగా ఉండటంతో మహేష్ నో చెప్పాడట. ఆ తర్వాత బన్నీకి కథ చెప్పడంతో తను ఓకే చేశాడట. అటు హీరోయిన్ గా మొదట సమంతాను అనుకున్నాడట సుకుమార్. రంగస్థలం సినిమాలో సమంత నటనకు ఫిదా అయిన సుకుమార్ ఇందులో శ్రీవల్లి క్యారెక్టర్ చేయాలని కోరాడట. కానీ తను పలు కారణాలతో నో చెప్పిందట. దీంతో ఆ అవకాశాన్ని రష్మిక చేజిక్కించుకుంది. సమంతాను ఐటెం సాంగ్ కు తీసుకున్నాడు సుకుమార్.

అటు ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కు ముందుగా దిశా పటాని అనుకున్నారట. ఆ తర్వాత నోరాఫతే అనుకున్నారట. నోరా సరే అన్నా భారీగా డబ్బు డిమాండ్ చేసిందట. దీంతో సమంతాను ఓకే చేశారట. భన్వర్ లాల్ షెకావత్ పాత్ర కు కూడా ముందు విజయ్ సేతుపతిని తీసుకుందాం అనుకున్నారట. అయితే తనకు డేట్లు కుదరకపోవడంతో బెంగాలీ యాక్టర్ జిష్ణు సేన్ ను ఓకే చేశారట. చివరకు తను కూడా నో చెప్పాడట. దీంతో నారా రోహిత్ ను అడిగారట. ఆయన కూడా నో చెప్పడంతో మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ ను తీసుకున్నారట.

Share post:

Popular