బూరెల బుట్టలో పడ్డ బంగార్రాజు.. ఇక తిరుగు లేదు?

సంక్రాంతి వచ్చిందంటే చాలు సినీ ప్రేక్షకులందరికీ పండగే. ఎందుకంటే ప్రతి హీరో తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తూ ఉంటాడు. సంక్రాంతికి విడుదల చేస్తే ఆ కలెక్షన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అని భావిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు కూడా. అందుకే సంక్రాంతి వచ్చింది అంటే బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా సందడి చేస్తూ ఉంటాయ్. అయితే ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ మేనియా కొనసాగుతుందని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ ఊహించని విధంగా ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది.

- Advertisement -

దీంతో సంక్రాంతికి విడుదలయ్యేందుకు ఎన్నో సినిమాలు సిద్ధమవుతున్నాయి. కానీ సినీ ప్రేక్షకులు అందరి దృష్టి మాత్రం నాగార్జున బంగార్రాజు సినిమా పైనే ఉంది అని చెప్పాలి. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కింది. కానీ సినిమా కాస్త స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో నాగార్జున తో పాటు కొడుకు నాగచైతన్య కూడా నటిస్తూ ఉండటం గమనార్హం. ఇక నాగార్జునకు జోడీగా ఎప్పటిలాగానే రమ్యకృష్ణ నటిస్తూండగా.. నాగచైతన్యకు జోడిగా క్యూట్ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ప్రస్తుతం సంక్రాంతికి విడుదలకు ఎన్నో చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. పండక్కి అసలు సిసలైన కిక్కిచ్చే సినిమా మాత్రం బంగార్రాజు అని అంటున్నారు ప్రేక్షకులు. ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో నాగార్జున బంగార్రాజు బూరెల బుట్టలో పడింది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.. ఇక పెద్ద హీరో సినిమాలు లేకపోవడంతో అటు బయ్యర్లు కూడా బంగార్రాజు సినిమా కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. నాగార్జున కు సంక్రాంతి అసలు పోటీ చేయలేదని.. ఇదే సినిమాకి ఎంతో ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఏదేమైనా బంగార్రాజు గా వస్తున్న టాలీవుడ్ మన్మథుడు ఇక ఈ సంక్రాంతికి హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు అక్కినేని అభిమానులు.

Share post:

Popular