సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చైతు షర్ట్ పిక్స్.. ధర ఎంతో తెలుసా ?

అక్కినేని కుటుంబానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ బాగా ప్రయారిలీ కలిగి ఉంటాయి. వారి నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా బాగా వైరల్ అవుతాయి. అలాగే అక్కినేని నాగ చైతన్య తాజాగా వేసుకున్న షర్ట్ బాగా పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆయన వేసుకున్న షర్ట్ కంపెనీ ఏంటి? దాని ధర ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన తాజా సినిమా బంగార్రాజు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తండ్రీ కొడుకులు తమ చక్కటి నటనతో జనాలను బాగా ఆకట్టుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది ఈ సినిమా. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈసినిమా కేవలం మూడు రోజుల్లో రూ. 50 కోట్లు సాధించింది. తాజాగా తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న జనాలకు సినిమా యూనిట్ థ్యాంక్స్ చెప్పింది. ఇందుకోసం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య వేసుకొచ్చిన షర్ట్ గురించి ఫ్యాన్స్ లో బాగా చర్చ మొదలైంది.

తాజాగా ఆయన వేసుకున్న డ్రెస్.. G-Star RAW బ్రాండ్. మెరైన్ స్లిమ్ షర్ట్‌ లో కూల్ అండ్ సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. ఈ షర్ట్ కాస్ట్.. 130 యూఎస్‌ డాలర్స్. మన కరెన్సీలో దీని విలువ సుమారు 9,620. నాగ చైతన్య ధరించిన ఈ షర్ట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. అటు అమిర్ ఖాన్ బాలీవుడ్ ఫిల్మ్ లాల్ సింగ్ చద్దాలో సైతం ఈయన కీ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా త్వరలోనే జనాల ముందుకు రాబోతుంది.

Share post:

Popular