ఆ హీరోతో ఎఫైర్.. మహేశ్వరి ఏమన్నదో తెలుసా?

సినిమా పరిశ్రమలో అఫైర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఎవరు ఎవరిని ప్రేమిస్తారో? ఎన్ని రోజులు ప్రేమిస్తారో? ఎప్పుడు విడిపోతారో? చెప్పడం చాలా అంటే చాలా కష్టం. ఒక్కోసారి హీరో, హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలు చేస్తే చాలు.. వారి మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు వస్తాయి. వాటిలో కొన్ని నిజాలు ఉన్నా.. చాలా వరకు టైంపాస్ ముచ్చట్లే ఉంటాయి. సీనియర్ హీరోయిన్ మహేశ్వరి విషయంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. ఓ హీరోతో తను ప్రేమాయణం నడిపిందనే టాక్ నడిచింది.

గులాబి సినిమాతో మహేశ్వరి హీరోయిన్ గా తెలుగు జనాలకు పరిచయం అయ్యింది. ఈమె మరెవరో కాదు శ్రీదేవి కజిన్. ఆమె ద్వారా తను సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తొలి సినిమా మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి. నీ కోసం, మా బాలాజీ, పెళ్లి, మా అన్న‌య్య, తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ సహా పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

తాజాగా ఈమె అలీతో సరదాగా షోలో పాల్గొంది. ఈ నేపథ్యంలో తన సినిమా జీవితంలో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. శ్రీదేవి కుటుంబం నుంచి వచ్చినందున తనకు బాగా పొగరు ఉంటుందని అందరూ అనుకుంటారని.. కానీ కూల్ గా ఉంటానని చెప్పింది. శ్రీదేవి తనకు పిన్ని అవుతుందని చెప్పింది. ఇక అప్పట్లో వడ్డే నవీన్ తో తనకు అఫైర్ ఉందని వార్తలు వచ్చినట్లు చెప్పింది. వాస్తవానికి తను సినిమా సెట్ లో కూడా ఎక్కువ మాట్లాడేవాడు కాదని చెప్పింది. చాలా సైలెంట్ అని చెప్పింది. మా ఇద్దరి మధ్య హాయ్, బాయ్ తప్ప పెద్ద మాటలేవీ ఉండేవి కాదన్నది. అయితే మా మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలు రావడం నవ్వును తెప్పించాయని వెల్లడించింది. మహేశ్వరి 2008లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని గడుపుతుంది.