ఎన్టీఆర్ దగ్గరున్న ఖరీదైన వాచ్ కలెక్షన్ గురించి మీకు తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా కలిసి నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న అనుకోని కారణాలతో వాయిదా పడింది. అటు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగాయి. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ జనాలను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ వాచ్ గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తోంది. అత్యంత ఖరీదైన ఈ వాచ్ లు అంటే ఆయనకు ఎంతో ఇష్టమట. వీటితో పాటు కార్లు బైకులన్నా తనకు చాలా మక్కువ అట.

తాజాగా ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ధర ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు. రిచర్డ్ మిల్లే ఆర్ఎం 011 కార్బోన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ రోజ్ గోల్డ్ లోటస్ F1 టీం కు చెందిన లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ఇది. ఆన్ లైన్ లో దీని ఖరీదు 3 కోట్ల 99 లక్షల 32 వేల 392 రూపాయాలు చూపిస్తుంది. దీంతో పాటు ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఆంపైర్ వాచ్ ప్రైస్ రూ.19 లక్షలు. ఆయనకు ఇవే కాదు.. రకరకాల కంపెనీల కాస్ల్టీ వాచెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనకు చాలా ఇష్టమైన వాచెస్. ఆయనకున్న ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఫోర్జ్డ్ కార్బన్ వాచ్ ప్రైస్ రూ.20 లక్షలుపైనే ఉంటుంది. ఇక ఆయన ధరించే మరో వాచ్ బివిఎల్ గరి బై రిట్రో స్టీల్ సెర్మైక్ ప్రైస్.. రూ.7 లక్షల 12 వేలు. కాగా, పనెరై లుమినర్ సబ్ మెర్స బుల్ వాచ్ ధర రూ.5 లక్షలట.

అటు తన సోదరుడు కల్యాణ్ రామ్ కు కూడా కోటి రూపాయల విలువ చేసే వాచ్ ను గిఫ్టుగా ఇచ్చాడట.

Share post:

Popular