సిల్క్ స్మిత ఏ హీరో చేతిలో మోసపోయి కన్ను మూసిందో తెలుసా ?

సిల్క్ స్మిత జీవితం ఎందరికో గుణపాఠం. ఎంత గొప్పగా బతికామన్నది మాత్రమే కాదు ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం .నేటి రోజుల్లో అయితే హీరోయిన్స్ చాలా తెలివిగా ఉంటున్నారు పైసా కూడబెడుతూ అనేక రకాల బిజినెస్ లో పెట్టుబడి పెడుతున్నారు.కానీ నాటి రోజులు అలా కాదు. సిల్క్ స్మిత నటి కావాలని హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని తనని తాను వెండి తెర పై చూసుకోవాలని కలలు కంది. అందుకోసం ఎంతో కష్టపడింది. హీరోయిన్ గా అవకాశాలు ఆమెను వెన్నంటి తొంగి చూడకపోయినా డాన్సర్ గా తనను తాను నిరూపించుకుంది. ఐటమ్ గర్ల్ గా, సినిమాల్లో డాన్స్ చేస్తూ ఎంతోమంది కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.

ఇక్కడ వరకు అంత బాగానే ఉంది కానీ కానీ సంపాదించిన డబ్బు ఏం చేయాలి అని ఒక్కసారి అనిపించిందా అక్కడే స్టార్ట్ అవుతుంది అసలు సమస్య. సిల్క్ స్మిత సినిమాలు ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా సినిమాలోనే పెట్టాలని నిర్ణయించుకుంది. నిర్మాతగా మారి సినిమా తీసి తానేంటో నిరూపించుకోవాలని కానీ పరాజయాలు ఆమెను పలకరించాయి సంపాదించిన డబ్బంతా సినిమా నిర్మాణంలో పెట్టింది. కానీ ఆమెను ఓ హీరో వాడుకుని వదిలేసాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. వాటిలో ఎలాంటి నిజం లేదు.

సిల్క్ స్మిత రామకృష్ణ డాక్టర్ ని అతడి భార్యతో సహా ఇంట్లో పెట్టుకుని తన సర్వస్వం కోల్పోయింది. సినిమాలు పరాజయం పాలయ్యాయి. చివరికి అప్పుల బాధ తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రోజు కూడా రామకృష్ణ అదే ఇంట్లో పక్క బెడ్ రూమ్ లో ఉన్నాడు ఏది ఏమైనా సిల్క్ స్మిత జీవితం అందరికీ గుణపాఠం. సంపాదించడం మాత్రమే కాదు దాచుకోవడం కూడా ముఖ్యం అని చెప్పడానికి సిల్క్ జీవితం ఒక ఉదాహరణ.

Share post:

Popular