యాంకర్ అనసూయ భర్త ఎవరు? ఏం చేస్తాడో మీకు తెలుసా?

యాంకర్ అనసూయ. వయసు పెరిగే కొద్దీ.. అందాల ప్రదర్శన మరింత ఎక్కువ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. తన హాట్ హాట్ యాంకరింగ్ తో బుల్లితెరను షేక్ చేసింది. ప్రస్తుతం వెండి తెరను కూడా ఊపు ఊపుతుంది. రంగంస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించింది. ఆ పాత్రలో అద్భుత నటన కనబర్చింది. తాజాగా వచ్చిన పుష్ప సినిమాల్లో మంచి నటనతో సత్తా చాటింది. దాక్షాయ‌ణి పాత్రలో దుమ్మురేపిం. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పెద్దగా పేలకపోయినా.. రెండో పార్టులో మంచి ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్న దర్శకుడు సుకుమార్ వెల్లడించాడు. అటు రంగమ్మత్త పాత్ర చేసిన తర్వాత తనకు టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి.

ఇక బుల్లితెరపై తన సందడి మామూలుగా ఉండదు. తన హాట్ హాట్ అందాలు, అద్భుతమైన వాయిస్ తో ఆమె చేసే పలు కార్యక్రమాలు మంచి రేటింగ్స్ తో దుమ్ము రేపాయి. మూడున్నర పదుల వయసు మీద పడ్డా, ఇద్దరు పిల్లలకు తల్లైనా.. అనసూయ కుర్ర హీరోయిన్లకు పోటీ వచ్చేలా నటిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండి తెరు ఏలబోతుంది.

అటు అనసూయ పర్సనల్ విషయాల గురించి తెలుసుకుంటే.. తను ప్రేమ పెళ్లి చేసుకుంది. భర్త భరద్వాజ్, అనసూయ కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్సీసీ క్యాంపులో భరద్వాజ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజుల క్రితం తన భర్తకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది అనసూయ. గతంలో తన భర్తను ఓ ప్రోగ్రాం ద్వారా పరిచయం చేసింది కూడా. ఆయన ఫైనాన్షియర్ అని వెల్లడించింది. ఫండింగ్ ప్లానర్ గా కూడా చేస్తున్నట్లు చెప్పింది. సోషల్ మీడియాలో తన గురించి ట్రోలింగ్స్ రావడం పట్ల చాలా బాధేసిందని అనసూయ చెప్పింది. అయితే తన భర్త ప్రోత్సాహంతో వాటిని లైట్ తీసుకున్నట్లు చెప్పింది.

Share post:

Latest