ఇండస్ట్రీ కి వచ్చాక అల్లు అర్జున్ ఇంత సంపాదించాడా ?

అల్లు అర్జున్.. బీభత్సమైన సినిమా బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నటుడు. తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్ సినిమా పరిశ్రమను ఎలా ఏలారో అందరికీ తెలిసిందే. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో జనాలకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందాడు. అయితే తన తొలి సినిమాలో ఆయన బాడీ, పర్సనాలిటీపై అప్పట్లో చాలా కామెంట్లు కూడా వచ్చాయి. అయితే తను అవేమీ పట్టించుకోలేదు. నెమ్మదిగా అద్భుత నటన కనబరుస్తూ ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించాడు. ప్రస్తుతం సౌత్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, ఫైట్స్, పాటలు, డ్యాన్స్ ఒకమేమిటీ అన్నింటిలోనూ అద్భుతం అనిపించుకుంటున్నాడు.

తెలుగు సినిమా పరిశ్రమలో తను ఇప్పటి వరకు 20 చిత్రాలకు పైగా నటించాడు. తాజాగా తను నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియన్ మూవీగా దుమ్మురేపుతుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సౌత్, నార్త్ అనే తేడా లేకుండా జనాలకు బాగా ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంది. దీనికి కొనసాగింపుగా మరో పార్ట్ కూడా రాబోతుంది. మొత్తంగా కరోనా తర్వాత సినిమా పరిశ్రమలో మంచి కిక్ ఇచ్చిన సినిమాగా పుష్ప గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అటు సినిమాల్లోకి వచ్చాక ఆయన బాగానే డబ్బు సంపాదించాడు. ఇప్పటి వరకు తను సినిమాల ద్వారా సుమారు 150 కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తుంది. ఒక్కో సినిమాకు 15 నుంచి 16 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. పుష్ప విజయం తర్వాత ఇప్పుడు ఆ మొత్తాన్ని మరింత పెంచినట్లు తెలుస్తోంది. 10 కోట్ల రూపాయల విలువ చేసే మూడు సూపర్ లగ్జరీ కార్లు తన దగ్గర ఉన్నాయి. వాటితో పాటు విలువైన బంగళాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సినిమాల్లోకి వచ్చాక ఆస్తి బాగానే కూడబెట్టాడట. అయితే వచ్చే డబ్బులో ఎక్కువగా తన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. పేద విద్యార్థులకు అందిస్తున్నాడు. చదువుతో పాటు వైద్య సేవలకు డబ్బును వినియోగిస్తున్నాడు.