వదిలేయాలనుకున్న కానీ వదల్లేదు అంటూ సమంత లేటెస్ట్ పోస్ట్ వైరల్ !

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్గా ఉండే టాలీవుడ్ హీరోయిన్స్ లో మొదటివరసలో ఎవరంటే సమంతానే .ఎప్పుడు కొత్త ఫోటీస్ ,వీడియోస్ ,మోటివేషన్ కొటేషన్స్ షేర్ చేసే సమంత నిత్యం అభిమానులతో మరియు నెటిజెన్లతో టచ్ లో ఉంటారు .తాజాగా సమంత సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది .ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే నేను వందసార్లు పడిపోయాను కానీ లేచి నిలబడ్డాను .వదిలేయాలని ఆలోచన వచ్చిన వదిలిపెట్టలేదు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది సమంత .

ప్రస్తుతం స్విజర్లాండ్లో టూర్ ఎంజాయ్ చేస్తున్న సంగతి మనకి తెలిసిందే .అక్కడ స్కైయింగ్ చేస్తూ వీడియోలు పెడుతున్న సంగతి మనకు తెలిసిందే .అయితే స్కైయింగ్ కోసం రోజుకి అయిదు నుండి ఆరు గంటలు ప్రాక్టీస్ చేస్తూ తాను పడ్డ కష్టాలు వీడియో రూపంలో చూపిస్తూ పోస్ట్ చేసారు సోషల్ మీడియాలో .నేను బన్నీ వాల్ పై నా స్కయినింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాను .వంద సార్లు పడిపోయాను ,పడిన ప్రతిసారి లేచాను .వదిలేయాలని ఆలోచన నా మనసులోకి వచ్చింది .కానీ సంతోషంగా ముందుకు నడిచాను అంటూ సమంత సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు .