విదేశాలలో పార్టీలతో ఎంజాయ్ చేస్తున్న హీరోల భార్యలు..!

 ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యలు అందరూ కలుస్తూ ఉంటారు. అలా ప్రస్తుత మహేష్ బాబు భార్య నమ్రత, మెగా కోడలు ఉపాసన వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అన్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరి ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి ఫంక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా హాజరవుతూ ఉంటారు. ఇక హీరోలు కూడా వారి ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండగా.. వారి భార్యలు మాత్రం దుబాయ్ లో సందడి చేస్తున్నారు. అక్కడ ఈ ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్న ట్లుగా కనిపిస్తోంది.

దుబాయ్‌లో పార్టీ చేసుకున్న స్టార్‌ హీరోలసతీమణులు..! - telugu news star hero wifes celebrated christmas in dubai

నమ్రత ఆమె సోదరి శిల్పా, మనీష్ మల్హోత్రా తదితరులకు ఉపాసన ప్రత్యేకంగా విందు ఇచ్చింది.. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది ఉపాసన. తనకిష్టమైన స్నేహితులతో రుచికరమైన భోజనం, తనకెంతో ఇష్టమైన వారితో దుబాయిలో ఈ మధ్యాహ్నం సరదాగా గడిచిందని వాసన తెలియజేసింది. మనీష్ ఈరోజు నిన్ను ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.. ఇలాంటి వేడుకలు త్వరలో హైదరాబాదులో మనందరం కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను.. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని నమ్రత పోస్ట్ చేసింది.

ఇక వీరందరితో పాటుగా అతి త్వరలోనే మనం హైదరాబాద్ లో ఇలాగే కలుసుకోవాలని రిప్లై ఇచ్చింది. ఉప్సీ. ఏమైనా అభిమానులు మాత్రం తమ హీరోల బార్యలు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

Share post:

Latest