స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్న సుక్కు..కారణం బన్నీనేనట..!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా పుష్ప.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించాడు. రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ నుంచే మంచి రెస్పాన్స్ రావడంతో వసూళ్లు కూడా అలాగే రాబట్టింది. ఎట్టకేలకు సినిమా సక్సెస్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు థాంక్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.

Allu Arjun-Sukumar film is a Revenge Drama?

అయితే ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు..”చాలా తక్కువ మందికి మాత్రమే నా జీవితంలో రుణపడి ఉన్నాను అనే పదాన్ని వాడతాను.. అందులో రైతు గా ఉన్న మా తాత అల్లు రామలింగయ్య సినిమాల్లోకి రాకపోతే.. మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉండే వాళ్ళం కాదు అంటు చెప్పుకొచ్చారు.

A tug of war over Sukumar

ఇక అంతే కాకుండా నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు, చిరంజీవి గారికి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు.ఆ తరువాత అలాంటి మాటను కేవలం సుకుమార్ కె వాడుతాను.. నాకు సుకుమార్ అంటే చాలా ఇష్టం.. పరుగు సినిమా సమయంలో నేను కేవలం 85 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాను.. నేను ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఎవరు అని ఆలోచించగా నాకు మొదటగా గుర్తుకు వచ్చేది సుకుమారే..

నువ్వు లేకపోతే నేనులేను సుక్కు.. ఇప్పుడు నా లైఫ్ ఇలా సక్సెస్ ఫుల్ గా సాగుతుంది అంటే అది నీ వల్లే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ స్పీచ్ వింటే దర్శకుడు సుకుమార్ కంటతడి పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది..

Share post:

Latest