మా నాన్నే నన్ను మోసం చేశారు అంటూ ఎమోషనల్ అయినా ప్రముఖ నటి..!!

ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు ఇతరులను అనూహ్యంగా నమ్మినవారి చేతిలో మోస పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక నటి మాత్రం ఏకంగా తన తండ్రి చేతిలో మోసపోయాను అని ఎమోషనల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న తులసి. బాలనటిగా కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె కొన్ని సినిమాలలో హీరోయిన్ రోల్స్ చేస్తే , మరికొన్ని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఇక కన్నయ్యకిట్టయ్య సినిమా లో తులసి చివరిసారిగా హీరోయిన్ గా నటించడం గమనార్హం. 300 చిత్రాలకు పైగా నటించింది.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి గెస్ట్ గా వచ్చిన తులసి మాట్లాడుతూ.. మా నాన్న చిన్నప్పుడే మోసం చేసి వెళ్లిపోయారు.. మా అన్నయ్య నాన్న లా మారి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారని ఆమె చెప్పింది.. అంతే కాదు భాస్కర్ అన్నయ్య ఐ లవ్ యు.. యూ ఆర్ ద బెస్ట్ అంటూ తులసి శ్రీదేవి కంపెనీ షో లో ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే ఈ నెల 5వ తేదీన ఈ టీవీ ఛానల్ లో ఈ షో ప్రసారం కానుంది.

Share post:

Latest