ఆ వెబ్ సిరీస్‌కి `పుష్ప‌` కాపీనా..? ఇప్పుడిదే హాట్ టాపిక్‌..!

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ న‌టించిన ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్ విల‌న్ పాత్ర‌ల‌ను పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్‌` భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 17న సౌత్ భాష‌ల‌తో పాటు హిందీలో విడుద‌లైంది.

డివైట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం దూసుకుపోతోంది. మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశాలు పుష్పలో పుష్క‌లంగా ఉండ‌టంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. పుష్ప కాపీ కథ అంటూ కొంద‌రు నెటిజ‌న్లు డైరెక్ట‌ర్ సుకుమార్‌ను ట్రోల్ చేస్తున్నారు. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫేమస్ వెబ్ సిరీస్ `నార్కోస్` ఆధారంగా పుష్ప‌ను తెర‌కెక్కించార‌ని.. అంద‌లో డ్రగ్ మాఫియా ఉండే ఇందులో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఉంటుంద‌ని అంటున్నారు.

అలాగే ఈ సిరీస్‌లోని హీరో పాత్ర ఆధారంగా పుష్ప‌రాజ్ పాత్ర‌ను రూపొందించార‌ని మ‌రియు కొండా రెడ్డి బ్రదర్స్ పాత్రల‌ను కూడా ఈ వెబ్ సిరీస్ నుంచే ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నార‌ని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. మ‌రి ఈ ట్రోల్స్‌పై పుష్ప టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

 

Share post:

Latest