ప్లీజ్ నన్ను ‘తల’ అని పిలవొద్దు.. స్టార్ హీరో రిక్వెస్ట్..!

తమిళనాడులో అజిత్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అజిత్ కోలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉన్నారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా తల అని పిలుచుకుంటూ ఉంటారు. కాగా తాజాగా ఆయన మీడియాకు, అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. నన్ను ఇకపై ఎవరూ తల అని పిలవొద్దు అని కోరారు. అజిత్ కుమార్, అజిత్, ఏకే అని పిలవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కు చెందిన అజిత్ మొదట తెలుగులోనే హీరోగా పరిచయమయ్యాడు. హీరోగా తన తొలి సినిమాగా తెలుగులో ప్రేమ పుస్తకం చేశాడు.

ఆ తర్వాత ఆయన కోలీవుడ్ లో వరుసగా సినిమాలు తీశాడు. స్టార్ హీరోగా ఎదిగాడు. మొదట ఆయనను అభిమానులు అల్టిమేట్ స్టార్ అని అని పిలిచేవారు. అప్పట్లో ఆయన తనను అలా పిలవద్దని రిక్వెస్ట్ చేయడంతో అల్టిమేట్ కార్ అని పిలవడం మానేశారు. అప్పట్లో తన పేరిట ఉన్న అభిమాన సంఘాలను కూడా అజిత్ చేశారు. 2001లో అజిత్ -మురుగదాస్ కాంబినేషన్ లో ధీన అనే సినిమా వచ్చింది. అందులో అజిత్ క్యారెక్టర్ పేరు తల. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడంతో అప్పటి నుంచి అభిమానులు అజిత్ ని తల అని పిలవడం మొదలుపెట్టారు.

అయితే తాజాగా అజిత్ తనను తల అని పిలవొద్దని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. అజిత్ పెద్దగా బయట తిరగడు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు ఖాతాలు లేవు. తన సినిమాల విడుదల సమయంలో కూడా ప్రమోషన్లు నిర్వహించడం, ప్రెస్ మీట్ పెట్టడం కూడా చేయడు. అయినా అజిత్ అంటే ఫ్యాన్స్ కు ఎనలేని అభిమానం. కోలీవుడ్ లో ఆయన సినిమా విడుదల అవుతుందంటే ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. కాగా అజిత్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో వలిమై అనే సినిమాలో నటిస్తున్నాడు.

Share post:

Latest