బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలేను ఎన్ని కోట్ల మంది చూశారో తెలిస్తే షాకే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లె విజ‌య‌వంతంగా పూర్తైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ షోలో చివ‌ర‌కు విజే.స‌న్నీ విజేత‌గా నిలిచి బిగ్‌బాస్ ట్రోఫీతో పాటుగా రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ, ఇర‌వై ల‌క్ష‌లు విలువ చేసే ఫ్లాట్‌, అదిరిపోయే బైక్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలే ఎపిసోడ్ ఎంత వైభవంగా జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఈ ఫినాలే ఎపిసోడ్‌కి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సాధార‌ణంగా ఫినాలే అంటే టీఆర్పీ రేటింగులు రికార్డ్ స్థాయిలో నమోదవుతాయి. అలాగే సీజ‌న్ 5 ఫినాలే ఎపిసోడ్ సైతం 18.4 టీఆర్పీని సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.

మ‌రోవైపు ఈ ఎపిసోడ్‌కి హాట్ స్టార్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదయ్యాయి. గ్రాండ్ ఫినాలేని ఏకంగా 4. 5 గంటలు ప్రసారం చేయ‌గా.. మొత్తం 6.2 కోట్ల మంది ఈ ఎపిసోడ్‌ను వీక్షించారు. ఈ లెక్క‌న బిగ్‌బాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. కాగా, బిగ్‌బాస్ సీజ‌న్ 6 త్వ‌ర‌లోనే ఓటీటీ వేదిక‌గా ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే నాగ్ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ నిర్వాహ‌కులు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డారు.

 

Share post:

Latest