బంగార్రాజు సినిమా నుంచి బిగ్ అప్డేట్.. లిరికల్ వీడియో టీజర్ రిలీజ్..!!

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా కొనసాగుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో బంగార్రాజు సినిమా నిలువనున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ను కూడా చిత్ర యూనిట్ సభ్యులు వేగవంతం చేయడం జరిగింది.

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ టీజర్ కూడా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ బాగా వైరల్ గా మారాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా సిద్ శ్రీరామ్ అందించారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి పాటను డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 5:12 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాలో నాగ చైతన్య నాగార్జున ఇద్దరు కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు. అయితే ఆ లిరికల్ టీజర్ మీరు కూడా చూసేయండి

Share post:

Latest